📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Rohit Sharma మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాలను చూస్తా

Author Icon By Anusha
Updated: August 30, 2025 • 7:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన ఆటలో శైలి, శాంత స్వభావం, పెద్ద ఇన్నింగ్స్ ఆడే తీరు ఆయనను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అయితే, రోహిత్ శర్మ కేవలం క్రికెట్‌కే పరిమితమైన వ్యక్తి కాదు. ఖాళీ సమయాల్లో సినిమాలు చూడడం, విశ్రాంతి తీసుకోవడం ఆయనకు ఎంతో ఇష్టం. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం ఆయన స్వయంగా వెల్లడించారు.సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ (Sports journalist Vimal Kumar) నిర్వహించిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తన వ్యక్తిగత అభిరుచుల గురించి పంచుకున్నారు. ముఖ్యంగా సినిమాల విషయానికి వస్తే, తనకు టాలీవుడ్ సినిమాలు కూడా బాగా నచ్చుతాయని ఆయన తెలిపారు. అందులోనూ తెలుగు అగ్ర హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్ నటించిన సినిమాలను చూసి ఆనందిస్తానని చెప్పారు.

అభిమానులను ఆనందపరిచే

తాను రెగ్యులర్‌గా ఎక్కువ సినిమాలు చూడలేనప్పటికీ, సమయం దొరికినప్పుడు తప్పకుండా చూడటానికి ఇష్టపడతానని రోహిత్ పేర్కొన్నారు.అల్లు అర్జున్, మహేశ్ బాబు వంటి నటులు తెలుగు సినీ రంగంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు. ప్రత్యేకంగా అల్లు అర్జున్ “పుష్ప” సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందగా, మహేశ్ బాబు (Mahesh Babu) తన క్లాస్ అండ్ మాస్ మిశ్రమ నటనతో కోట్లాది ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల అభిమానుల జాబితాలో ఇప్పుడు రోహిత్ శర్మ పేరు కూడా చేరడం టాలీవుడ్ అభిమానులను ఆనందపరిచే అంశంగా మారింది.తనకు యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కే చిత్రాలు, డాక్యుమెంటరీలు అంటే ఇష్టమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.రోహిత్ శర్మ‌కు తెలుగు భాషతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అతని అమ్మమ్మ ఊరు వైజాగ్.

Latest News

అభిమాన నటులని

రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ వైజాగ్‌కు చెందినవారే. రోహిత్ మాతృ భాష తెలుగు అయినప్పటికీ అతను ఎక్కువగా మరాఠి, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతారు. తెలుగు భాష తెలిసినా స్పష్టంగా మాట్లాడలేడు. కానీ తెలుగు తనకు బాగా అర్థమవుతుందని రోహిత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.సౌత్ హీరోలను పెద్దగా అభిమానించకున్నా..బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్ తన అభిమాన నటులని రోహిత్ శర్మ తెలిపాడు. హీరోయిన్లలో విద్యా బాలన్, దీపికా పడుకొనే అంటే ఇష్టమని, కరీనా కపూర్ (Kareena Kapoor) అంటే తనకు క్రష్ ఉందని కూడా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. హైదరాబాద్‌తో రోహిత్ శర్మకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఐపీఎల్ కెరీర్‌ను రోహిత్ శర్మ హైదరాబాద్‌కు చెందిన డెక్కన్ ఛార్జర్స్‌తోనే ప్రారంభించాడు. అతను ఈ జట్టు తరఫున మూడేళ్లు ఆడాడు. అరంగేట్ర ఐపీఎల్ 2008 సీజన్‌తో పాటు 2009, 2010 వరకు డెక్కన్ ఛార్జర్స్‌లోనే కొనసాగాడు. ఐపీఎల్ 2019 టైటిల్ గెలవడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు.

లేకుంటే అతనే

ఐపీఎల్ 2011 మెగా వేలంలో అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. లేకుంటే అతనే డెక్కన్ ఛార్జర్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యేవాడని ఆ జట్టు విన్నింగ్ కెప్టెన్ గిల్ క్రిస్ట్ చాలా ఇంటర్వ్యూల్లో తెలిపాడు. మూడేళ్ల పాటు హైదరాబాద్‌కు ఆడిన రోహిత్ శర్మకు పాపులర్ తెలుగు హీరోల గురించి అవగాహన ఉంది. రోహిత్ శర్మ బయోపిక్‌కు టాలీవుడ్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, శర్వానంద్ సరిగ్గా సరిపోతారని అతని ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు.టీ20, టెస్ట్ ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే మూడు వన్డేల సిరీస్‌తో మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-prashant-asia-cup-team-india-manager-meets-pawan-in-visakhapatnam/andhra-pradesh/538568/

Breaking News latest news Rohit sharma rohit sharma interview rohit sharma mahesh babu rohit sharma movies rohit sharma tollywood Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.