📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Rohit Sharma హీరోయిన్ కరీనా కపూర్ అంటే నాకు చాలా ఇష్టం

Author Icon By Anusha
Updated: September 1, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ జట్టులో “హిట్‌మ్యాన్”గా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ తన క్రికెట్ ప్రయాణం ఎంత గొప్పదో అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చినప్పుడు అభిమానులు మరింత ఆసక్తిగా గమనిస్తారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తనకు ఇష్టమైన హీరోయిన్ పేరును వెల్లడించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (heroine Kareena Kapoor) అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె తన క్రష్ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఈ మాటలు వినగానే క్రికెట్ అభిమానులు, బాలీవుడ్ ప్రేక్షకులు ఇద్దరూ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చించుకున్నారు.రోహిత్ శర్మ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. మొదటి మ్యాచ్ నుంచే తన స్ట్రోక్స్‌తో, క్లాస్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే మొదటి కొన్ని సంవత్సరాలు ఆయనకు అంత తేలికగా లేవు. జట్టులో స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు. 2013 వరకూ అతని కెరీర్‌లో తీవ్ర ఒడిదొడుకులు కనిపించాయి. కొన్నిసార్లు మంచి ఇన్నింగ్స్ ఆడినా, స్థిరత్వం లోపించడం వల్ల తరచూ జట్టులో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

సచిన్ రిటైర్మెంట్ తర్వాత రోహిత్ రైజ్

2013లో ఒక మలుపు తిరిగింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రిటైర్ అవ్వడంతో భారత జట్టులో ఓపెనర్ స్థానంలో పెద్ద ఖాళీ ఏర్పడింది. అప్పుడు రోహిత్ శర్మకు అవకాశం లభించింది. ఆ అవకాసాన్ని పట్టుకొని ఇక వెనుదిరిగి చూడలేదు. వన్డేల్లో వరుసగా డబుల్ సెంచరీలు చేయడం, టెస్ట్ మ్యాచ్‌ల్లో పెద్ద స్కోర్లు నమోదు చేయడం ద్వారా రోహిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.గత 18 ఏళ్లుగా భారత జట్టులో కొనసాగుతున్న రోహిత్..టీ20, టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో అక్టోబర్‌లో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో మళ్లీ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

Latest News

ఆసక్తికర విషయాలు

ఇటీవలే బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో యో యోతో పాటు బ్రాంకో టెస్ట్‌లను రోహిత్ శర్మ (Rohit Sharma) క్లియర్ చేశాడు. కెరీర్ ఆరంభంలో(2013) రోహిత్ శర్మ ఫిల్మ్‌ఫేర్ అనే వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ కుమార్‌లు తన అభిమాన నటులని చెప్పిన రోహిత్ శర్మ.. హీరోయిన్లలో విద్యా బాలన్, దీపికా పడుకొనే నటన అంటే చాలా ఇష్టమని తెలిపాడు.ఇక కరీనా కపూర్ అంటే తనకు పిచ్చి అని, ఆమె తన క్రష్ అని పేర్కొన్నాడు. సినిమాల్లో నటించే అవకాశం వస్తే.. కరీనా కపూర్‌తో చేస్తానని కూడా తన మనసులోని మాటను వెల్లడించాడు. ‘కరీనా కపూర్ చాలా అందంగా ఉంటుంది. ఆమె అంటే నాకు ఎప్పటినుంచో క్రష్ ఉంది. నేను ఆమెకు డైహార్డ్ ఫ్యాన్. ఆమె సినిమాలు అన్నీ చూశాను.’అని తెలిపాడు.

డైరెక్టర్ సినిమా ఆఫర్ చేసిన ఘటన

అంతేకాకుండా ఓ యాడ్ షూట్ సందర్భంగా డైరెక్టర్ సినిమా ఆఫర్ చేసిన ఘటనను కూడా రోహిత్ గుర్తు చేసుకున్నాడు. ‘ఒకసారి యాడ్ షూటింగ్ చేస్తున్నప్పుడు.. ఆ డైరెక్టర్ నా ఫేస్ చాలా ఫోటోజెనిక్‌గా ఉందని చెప్పాడు. సినిమాల్లో సెట్ అవుతారని తెలిపాడు. నాతో కలిసి సినిమా తీయాలనుందని చెప్పాడు. అయితే నాకు సినిమాలు తీసే సమయం లేదని, నా వ్యక్తిగత పనులకే సమయం దొరకడం లేదన్నాను.క్రికెట్ తప్పా తాను మరేమి ఆలోచించడం లేదని చెప్పాను. నా కెరీర్ ఆరంభంలోనే ఉందని, భవిష్యత్తులో అవకాశం వస్తే యాక్టింగ్ గురించి ఆలోచిస్తానని బదులిచ్చాను. ఒకవేళ నేను సినిమాలో నటిస్తే కరీనా కపూర్ నా హీరోయిన్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. ఆమె సినిమాలన్నీ నాకు బాగా నచ్చుతాయి.’అని ఆ ఇంటర్వ్యూలో హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ అంతర్జాతీయ అరంగేట్రం ఎప్పుడు చేశాడు?

రోహిత్ శర్మ 2007లో ఐర్లాండ్‌పై వన్డే మ్యాచ్‌తో భారత జట్టులో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో కూడా ఆడాడు.

రోహిత్ శర్మ ప్రత్యేకత ఏమిటి?

రోహిత్ శర్మ తన శ్రద్ధాకరమైన బ్యాటింగ్, పెద్ద ఇన్నింగ్స్ ఆడగలిగే నైపుణ్యం, శీఘ్ర శతకాలు కొట్టగల ప్రతిభతో ప్రసిద్ధుడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-lionel-messi-had-a-bitter-experience-in-the-leagues-cup-final-for-inter-miami-star-lionel-messi/international/539292/

Breaking News india cricket captain latest news Rohit sharma rohit sharma favorite actress rohit sharma interview rohit sharma kareena kapoor Rohit Sharma ODI Captain Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.