📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Ricky Ponting – డగౌట్ నుంచి సలహాలు తీసుకొని ఏకైక కెప్టెన్ ధోనీనే

Author Icon By Anusha
Updated: September 6, 2025 • 2:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించి ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఒక ప్రసిద్ధ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ, ప్రస్తుత ఐపీఎల్, ఆధునిక క్రికెట్‌లో కోచ్‌లు, డగౌట్ సభ్యులు ఎంత ప్రాముఖ్యం పొందారో వివరణ ఇచ్చారు.

పాంటింగ్ చెప్పినట్లుగా, ఈ రోజుల్లో క్రికెట్ మాదిరే ఫుట్‌బాల్ ఆటలా మారిపోతోంది. ఆటలోని ప్రతి లాభం లేదా మునుపటి తప్పు ఆటగాళ్లు బౌండరీ లైన్ దగ్గర నిలిచిన కోచ్‌ల సలహాల ద్వారా సరిచేయబడుతుంది. ప్రతి మ్యాచ్‌లో డగౌట్ నుండి నిరంతరం సూచనలు ఇవ్వడం సాధారణమైంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఆటగాళ్లకు స్వతహంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

క్రీడా వ్యూహాల ఆధారంగా జట్టును ముందుకు నడిపించడం

అయితే, పాంటింగ్ ప్రత్యేకంగా ధోనీ (Dhoni) ని ప్రశంసించారు. అతని మాటల ప్రకారం, ధోనీ ఐపీఎల్‌లో డగౌట్ నుంచి సలహాలు తీసుకోకుండానే జట్టును సమర్థవంతంగా నడిపే అరుదైన కెప్టెన్. డగౌట్ సలహాల మీద ఆధారపడి పోరాటాలు చేసే ప్రస్తుత కాలంలో, ధోనీ తన అనుభవం, క్రీడా నైపుణ్యం, ఆలోచనాత్మక క్రీడా వ్యూహాల ఆధారంగా జట్టును ముందుకు నడిపించడం. గొప్ప విషయం అని పాంటింగ్ తెలిపారు.ధోనీ తన నిర్ణయాలపై పూర్తి నమ్మకంతో ఉంటాడు.

మ్యాచ్ సమయంలో డగౌట్ నుంచి వచ్చే సలహాలపై ఏ మాత్రం ఆధారపడడు. కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ మైదానంలో సారథులకు సలహాలు ఇవ్వడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. కానీ ధోనీ మాత్రం ఎవరీ సలహాలు తీసుకోడు. ఇదే అతన్ని ప్రత్యేకమైన సారథిగా నిలబెట్టింది. ఐపీఎల్‌లో అత్యంత నిలకడగా రాణించే జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఒకటి. ఇందుకు ధోనీ నాయకత్వమే కారణం.’అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

Latest News

గేమ్‌లో చేయాల్సిన విషయాలపై అయ్యర్ తరుచూ

ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌లో తమ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు చాలా సలహాలు ఇచ్చామని కూడా రికీ పాంటింగ్ గుర్తు చేసుకున్నాడు. ‘మా తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌కు చాలా సలహాలు ఇచ్చాం. గేమ్‌లో చేయాల్సిన విషయాలపై అయ్యర్ తరుచూ ప్రశ్నలు అడిగాడు. టైమ్ ఔట్ సమయంలో కెప్టెన్లు, సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడేందుకు కోచ్‌లకు అవకాశం ఉంటుంది.’అని పాంటింగ్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సీజన్ మధ్యలోనే తప్పుకోవడంతో ధోనీనే మళ్లీ జట్టును నడిపించాడు. కానీ సీఎస్‌కే ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. 14 మ్యాచ్‌ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ధోనీ 13 ఇన్నింగ్స్‌ల్లో 135.17 స్ట్రైక్ రేట్‌తో 196 పరుగులే చేశాడు.

రికీ పాంటింగ్ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు?

రికీ పాంటింగ్ 1974 డిసెంబర్ 19న ఆస్ట్రేలియాలోని టాస్మేనియాలో జన్మించారు.

రికీ పాంటింగ్ కెరీర్ ప్రారంభం ఎప్పుడు?

రికీ పాంటింగ్ 1995లో ఆస్ట్రేలియా జట్టులో వన్డే క్రికెట్ ద్వారా ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభించారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-us-open-final-2025-osaka-loses-in-semis/international/542418/

Breaking News Chennai Super Kings cricket commentary Indian Cricket ipl captain IPL News latest news Mahendra Singh Dhoni MS Dhoni punjab kings coach Ricky Ponting Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.