📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: RCB తొక్కిసలాట ఘటన.. విచారం వ్యక్తం చేసిన ఆర్‌సీబీ

Author Icon By Anusha
Updated: August 28, 2025 • 2:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో మొదటిసారి కప్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) (RCB) చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అభిమానుల కలను సాకారం చేస్తూ గెలుపు పతాకాన్ని ఎగరేసింది. అయితే ఆ విజయోత్సవం తర్వాత జరిగిన విషాద ఘటన కారణంగా జట్టు సోషల్ మీడియా వేదికలు మూడు నెలల పాటు స్తబ్దుగా మారాయి. తాజాగా ఆ మౌనాన్ని చెరిపేసి, ఒక కీలక ప్రకటన చేసింది.విజయోత్సవ వేడుకల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి కూడా ఉన్నారు. అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఈ దుర్ఘటనతో ఆనందాన్ని పంచుకోవడానికి చేరుకున్న కుటుంబాలు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ సంఘటన కేవలం కర్ణాటక రాష్ట్రానికే కాకుండా, మొత్తం దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.

అభిమానుల ప్రాణనష్టం

ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కర్ణాటక ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రారంభించింది. ఆర్‌సీబీ టీమ్ మేనేజర్‌తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్స్‌పై కేసులు నమోదు చేసింది. అంతేకాదు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత పోలీస్ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని గుర్తించి వారిపైన కూడా శిక్షణాత్మక చర్యలు తీసుకుంది. అభిమానుల ప్రాణనష్టం కారణంగా కేవలం క్రీడా విజయోత్సవం మాత్రమే కాకుండా, మొత్తం జట్టుపై దుఃఖం మబ్బులా కమ్ముకుంది.ఈ ఘటనలో మృతి చెందిన వారికి, గాయపడిన వారికి కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆర్‌సీబీ ఆర్థిక సాయం ప్రకటించింది. మరింత ఆర్థిక సాయం చేసేందుకు ఆర్‌సీబీ కేర్స్ (RCB Cares) ద్వారా ఫండ్ రైజింగ్ క్యాంపైన్‌ నిర్వహించింది. ఆ ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెట్టని ఆర్‌సీబీ.. ఇన్నాళ్లకు ఆర్‌సీబీ కేర్స్ గురించి చెబుతూ ఓ ప్రకటన చేసింది.

విచారం వ్యక్తం చేసిన ఆర్‌సీబీ

‘ప్రియమైన 12వ మ్యాన్ ఆర్మీ(అభిమానులు)..ఇ ది మీకు మా హృదయపూర్వక లేఖ! ఇక్కడ మేము చివరిగా పోస్ట్ చేసి దాదాపు మూడు నెలలు (3 Months) అవుతోంది. మీకు దూరంగా ఉండాలని ఇలా చేయలేదు. దుఃఖంతోనే ఇలా చేశాం. ఈ వేదిక ఒకప్పుడు ఉత్సాహంగా, మధుర జ్ఞాపకాలతో, మీరు ఆస్వాదించిన క్షణాలతో కనిపించేది. కానీ జూన్ 4వ తేదీన చోటు చేసుకున్న ఘటన ఒక్కసారిగా అన్నింటినీ మార్చేసింది.ఆ దురదృష్టకర ఘటన మా గుండెలను ముక్కలు చేసింది. ఆ బాధను భరించేందుకే మేం ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. ఈ సమయంలో మేం ఎంతో ఏడ్చాం. ఎన్నో విషయాలు విన్నా.. నేర్చుకున్నాం. ఈ ప్రక్రియలోనే ఆర్‌సీబీ కేర్ పురుడు పోసుకుంది. అభిమానులను గౌరవించాలని, అండగా నిలబడాలనే అవసరం నుంచి పుట్టింది. మా అభిమానుల కోసం నిర్వహించే కార్యక్రమాల కోసమే ఈ వేదికను ఏర్పాటు చేశాం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు సుదీర్ఘ విరామం తర్వాత ఈ వేదికపైకి వచ్చాం. మీతో ఈ విషయాన్ని పంచుకోవడానికి, అండగా నిలబడటానికి, కలిసి ముందుకు నడవడానికి, కర్ణాటకను గర్వంగా నిలబెట్టేందుకు ఆర్‌సీబీ కేర్స్ పనిచేస్తోంది.’అని ఆర్‌సీబీ ఆ పోస్ట్‌లో పేర్కొంది.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-tennis-legend-daniil-medvedev-fined-heavily-for-inappropriate-behavior/international/537059/

Breaking News IPL 2025 latest news RCB Cares RCB champions RCB fans RCB social media comeback RCB stampede incident RCB victory celebrations Royal Challengers Bangalore Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.