📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Rajasthan Royals శ్రీశాంత్ ఇన్సూరెన్స్ వివాదం..సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాజస్థాన్ రాయల్స్

Author Icon By Anusha
Updated: September 3, 2025 • 10:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఆడిన క్రికెటర్ శ్రీశాంత్‌కు సంబంధించి ఒక పాత కేసు మరోసారి చర్చకు వచ్చింది. 2012లో జరిగిన ఒక ఘటనలో శ్రీశాంత్‌కు గాయం కావడంతో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ వారి తరఫున ఇన్సూరెన్స్ కంపెనీ వద్ద క్లెయిమ్ దాఖలు చేసింది. అయితే, ఆ క్లెయిమ్‌ను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (United India Insurance Company) అంగీకరించకపోవడంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు రావడంతో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.2012లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడిన శ్రీశాంత్.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో మోకాలికి గాయం కావడంతో ఆ సీజన్‌కు దూరమయ్యారు. దీంతో ఫ్రాంచైజీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రూ.82.80 లక్షల క్లెయిమ్ కోరింది. అయితే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఈ క్లెయిమ్ ను తిరస్కరించింది. వారి వాదన ప్రకారం.. శ్రీశాంత్‌ (Sreesanth) కు 2011 నుంచే కాలి వేలికి గాయం ఉంది. ఈ విషయాన్ని వారు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో వెల్లడించలేదు.

గాయం, క్లెయిమ్ వెనుక కథ

ఆ పాత గాయం వల్లే శ్రీశాంత్ 2012లో ఆడలేకపోయాడని ఇన్సూరెన్స్ కంపెనీ వాదిస్తోంది. దీనికి భిన్నంగా.. రాజస్థాన్ రాయల్స్ మాత్రం కాలి వేలి గాయం ఒక సమస్య కాదని.. ఆ గాయంతో కూడా శ్రీశాంత్ ఆడాడని వాదించిది. 2012లో మోకాలికి అయిన కొత్త గాయం వల్లే అతను ఆడలేకపోయాడని, కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ తమకు చెందాలని తెలిపింది.గతంలో ఈ కేసు నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ (NCDRC) లో రాజస్థాన్ రాయల్స్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనితో ఇన్సూరెన్స్ కంపెనీ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఈ కేసును విచారించారు.

Latest News

ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది

ఈ సందర్భంగా వారు కాలి వేలి గాయం గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి ముందుగానే తెలియజేశారా లేదా అని ప్రశ్నించారు. ఒకవేళ ఆ విషయం తెలిసి ఉంటే.. కంపెనీ అతనికి ఇన్సూరెన్స్ ఇచ్చి ఉండకపోవచ్చు లేదా అధిక ప్రీమియం వసూలు చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, శ్రీశాంత్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సహా ఇతర పత్రాలను సమర్పించాలని ఇన్సూరెన్స్ కంపెనీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పత్రాలు సమర్పించిన తర్వాత ఈ కేసు విచారణను తిరిగి ప్రారంభిస్తారు.

ఈ జట్టు ఎప్పుడు స్థాపించబడింది?

రాజస్థాన్ రాయల్స్ జట్టు 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే ఉంది.

జట్టు హోమ్‌ గ్రౌండ్ ఎక్కడుంది?

రాజస్థాన్ రాయల్స్ జట్టు హోమ్‌ గ్రౌండ్ జైపూర్‌లోని సావాయి మాన్సింగ్ స్టేడియం.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/rashid-khan-afghanistan-vs-uae-tri-series-first-win-t20i-record/sports/540002/

2012 injury Breaking News Cricket News insurance claim IPL latest news legal dispute Rajasthan Royals sreesanth case Supreme Court Telugu News united india insurance

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.