📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Hardik Pandya – హార్దిక్ పాండ్యా ధరించిన వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

Author Icon By Anusha
Updated: September 10, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా ఖండంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్‌లలో ఒకటైన ఆసియా కప్ 2025 (Asia Cup 2025) కి నేటి నుంచి అధికారికంగా శ్రీకారం చుట్టబడుతోంది. భారత్ జట్టు తమ టైటిల్ వేటను బుధవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) తో తలపడుతూ ప్రారంభించనుంది. గతంలో అనేకసార్లు ఈ టోర్నీలో గెలుపొందిన టీమిండియా, ఈ సారి కూడా కప్‌ను ఎత్తిపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆటగాళ్లంతా ఇప్పటికే కఠినమైన సాధన చేస్తూ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే మ్యాచ్‌లు మొదలుకాకముందే, జట్టులోని కీలక ఆటగాడు హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా హాట్ టాపిక్ అయ్యాడు. కారణం ఏంటంటే – ఆయన ట్రెండీ లుక్. ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన హార్దిక్, విలువైన వాచ్ ధరించి కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా హార్దిక్ (Hardik Pandya) ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ విషయాల్లో ఎప్పుడూ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటాడు. ఈ సారి కూడా తన స్టైల్‌తో అభిమానుల్లో చర్చకు దారితీశాడు.

హార్దిక్ పాండ్యా వాచ్ ధర కంటే తక్కువ

హార్దిక్ పాండ్యా అత్యంత ఖరీదైన వాచ్ ధరించి దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్‌కు వచ్చాడు. అతడు రిచర్డ్ మిల్లె ఆర్ఎమ్27-04 వాచ్ ధరించినట్లు ఫొటోల్లో కనిపించింది. దీని ధర దాదాపుగా రూ.20 కోట్లు అని సమాచారం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన వాచ్‌లలో రిచర్డ్ మిల్లె (Richard Mille Watch) ఒకటి అని తెలుస్తోంది. ప్రపంచంలో కేవలం 50 మంది వద్ద మాత్రమే ఈ వాచ్ ఉందట. స్పెయిన్ టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ కోసం తొలుత ఈ వాచ్ తయారు చేశారు.

ఈ వాచ్ బరువు కూడా చాలా తక్కువే. కేవలం 30 గ్రాములే ఉంటుంది.ఇది చూసిన నెటిజన్లు.. ఆసియాకప్‌ 2025 విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీ కూడా హార్దిక్ పాండ్యా వాచ్ (Hardik Pandya Watch) ధర కంటే తక్కువ అని పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆసియాకప్ 2025 విన్నర్‌కు 3 లక్షల అమెరికా డాలర్లు అంటే రూ.2.6 కోట్ల ప్రైజ్‌మనీ దక్కుతుంది. కానీ పాండ్యా వాచ్ ధర రూ.20 కోట్లు.

భారత్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్నాడు

ఈ లెక్కన ఆసియా కప్‌ ప్రైజ్‌మనీ కంటే హార్దిక్ వాచ్ ధర 8 రెట్లు ఎక్కువ అన్నట్లు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్.. షాక్ అవుతున్నారు.ఇక ఆసియా కప్ 2025లో అదరగొట్టేందుకు హార్దిక్ పాండ్యా సిద్ధం అవుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ తరఫున కీలక ఆటగాడిగా ఉన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో తనదైన ప్రదర్శన చేస్తూ జట్టు విజయాల్లో అతడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈసారి కూడా అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో పాండ్యా ఉన్నాడు.

హార్దిక్ పాండ్యా ఏ ఫార్మాట్లలో ఆడుతున్నాడు?

హార్దిక్ పాండ్యా టీ20, వన్డే, టెస్ట్ మూడు ఫార్మాట్లలోనూ ఆడాడు. ముఖ్యంగా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్‌లో కీలక ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/prithvi-shaw-mumbai-sessions-court-imposes-rs-100-fine-on-prithvi-shaw/sports/544487/

Asia Cup 2025 Breaking News Hardik Pandya expensive watch Hardik Pandya trendy look india vs uae latest news Team India first match Team India practice session Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.