📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Latest News: Gambhir గంభీర్‌కు కోర్టులో చుక్కెదురు

Author Icon By Anusha
Updated: August 28, 2025 • 9:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ (Gautam Gambhir) కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోవిడ్ కాలంలో మందుల అక్రమ నిల్వల కేసులో తనపై కొనసాగుతున్న క్రిమినల్ విచారణను నిలిపివేయాలని గంభీర్ తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు ఖండించింది. ఈ కేసు విచారణ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టంచేసింది.విచారణ సందర్భంగా గంభీర్ న్యాయవాది.. తన క్లైంట్ ఒక మాజీ ఎంపీ అని, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌తో పాటు ప్రస్తుత హెడ్ కోచ్ అని, ఆయన సేవా కార్యక్రమాలు గుర్తించి ప్రస్తావించగా.. న్యాయమూర్తి ఘాటుగా స్పందించారు. పేరు చెప్పి కోర్టును ప్రభావితం చేయరాదని మందలించారు. అవి న్యాయ ప్రక్రియకు సంబంధించినది కాదని వ్యాఖ్యానించారు.గతంలో ఈ కేసు విచారణపై హైకోర్టు స్టే విధించింది. ఆ స్టేను ఏప్రిల్ 9వ తేదీన కోర్టు రద్దు చేసింది. దీనిపై గంభీర్ తరపున మళ్లీ విచారణకు విజ్ఞప్తి చేయగా, దానిని కోర్టు ఆగస్టు 29న విచారిస్తానని తెలిపింది. గంభీర్ తరపు న్యాయవాదులు ట్రయల్ కోర్టు (Trial Court) లో విచారణను తిరిగి నిలిపివేయాలని కోరారు. హైకోర్టు అందుకు అంగీకరించలేదు. కానీ ఈ కేసు విచారణ త్వరలో జరుగుతుందని హామీ ఇచ్చింది.

Latest News

గంభీర్ ఫౌండేషన్ తప్పు చేసిందని

వివరాల్లోకి వెళ్తే,2021 కరోనా రెండో వేవ్‌లో గౌతమ్ గంభీర్‌కు చెందిన ఫౌండేషన్ ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ చేసి పంపిణీ చేసిందని ఢిల్లీ డ్రగ్ కంట్రోల్ శాఖ (Delhi Drug Control Department) కేసు నమోదు చేసింది. ‘డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్’ నిబంధనలను ఉల్లంఘించారని తమ ఫిర్యాదులో పేర్కొంది.ఈ కేసు విషయంపై ఢిల్లీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా.. మందుల కొరత ఉన్న సమయంలో ఈ విధంగా పంపిణీ చేయడం వల్ల నిజమైన రోగులకు ఇబ్బందులు కలిగాయని కోర్టు అభిప్రాయపడింది. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ తప్పు చేసిందని డ్రగ్ కంట్రోలర్ హైకోర్టుకు నివేదించింది.ఈ కేసుకు సంబంధించి గంభీర్ తరఫు న్యాయవాదులు నాలుగేళ్లుగా వాదనలు వినిపిస్తున్నారు. ప్రజల సహాయార్థమే ఫాబీఫ్లూ ట్యాబ్లెట్లను నిల్వచేసి పంపిణీ చేశారని, సేవా కార్యక్రమాలకు లైసెన్సులు అవసరం లేదని వాదించారు. అయితే ఈ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఏ ఉద్దేశంతో చేసినా ఔషధాల నిల్వ, పంపిణీ విషయంలో చట్టపరమైన నియమాలు తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-england-bowler-mark-wood-finds-it-very-difficult-to-compete-with-rohit-sharma/international/536807/

Breaking News Court Rejection Covid Medicine Hoarding Case criminal proceedings Delhi High Court Former MP Gautam Gambhir latest news team india head coach Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.