📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Latest News: Former cricketer RP Singh – సంజూ శాంసన్ స్ట్రైక్‌రేట్ మెరుగ్గా ఉంటుంది :ఆర్‌పీ సింగ్

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 7:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 సమరం దగ్గరపడుతున్న కొద్దీ టీమిండియా జట్టు కాంబినేషన్‌పై దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తోంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్‌లో ఎవరికీ అవకాశమిస్తారు? ఎవరు ప్లేయింగ్ ఎలెవన్‌లో నిలబడతారు? అన్న చర్చ జోరందుకుంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ ఆర్‌పీ సింగ్ (RP Singh) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆర్‌పీ సింగ్ అభిప్రాయం ప్రకారం, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కంటే వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ స్ట్రైక్‌రేట్‌లో మెరుగ్గా ఆడుతున్నాడని చెప్పారు. “టీ20 ఫార్మాట్ అనేది పూర్తిగా ఫియర్‌లెస్ క్రికెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఎక్కువ బంతులు ఆడుతూ స్థిరంగా ఆడటం కంటే, తక్కువ బంతుల్లో ఎక్కువ రన్స్ చేయడం ముఖ్యమని” ఆర్‌పీ సింగ్ వ్యాఖ్యానించారు.

వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా దక్కాయి

మరికొద్ది గంటల్లో ఆసియా కప్ 2025 టోర్నీకి తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్ జట్లు తలపడనున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 10) యూఏఈ‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. ఈ టోర్నీ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే రీఎంట్రీ ఇవ్వగా.. శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా దక్కాయి. దాంతో టీమిండియా కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతేడాదిగా భారత టీ20 జట్టుకు శుభ్‌మన్ గిల్ దూరంగా ఉండటంతో సంజూ శాంసన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో 3 శతకాలతో సత్తా చాటాడు.

Latest News

ఓపెనర్‌గా ఆడిన సంజూను మళ్లీ మిడిలార్డర్‌లో

శుభ్‌మన్ గిల్ రీఎంట్రీతో ఓపెనర్‌గా ఎవరు? ఆడుతారనేది చర్చనీయాంశమైంది.వైస్ కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్‌నే ఓపెనర్‌గా ఆడిస్తారనే సంకేతాలను టీమిండియా మేనేజ్‌మెంట్ ఇచ్చింది. ఇన్నాళ్లు ఓపెనర్‌గా ఆడిన సంజూ (Sanju Samson) ను మళ్లీ మిడిలార్డర్‌లో ఆడిస్తారా? లేక బెంచ్ పరిమితం చేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే మరో వికెట్ కీపర్ జితేష్ శర్మకు లోయరార్డర్‌లో మెరుగైన రికార్డ్ ఉంది. ఈ క్రమంలోనే సంజూ శాంసన్ కంటే శుభ్‌మన్ గిల్ స్ట్రైక్‌రేట్ చాలా తక్కువగా ఉందని ఆర్‌పీ సింగ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నాడు.

స్ట్రైక్ రొటేట్ చేయగల ఒక ఆటగాడు జట్టుకు అవసరం

‘బ్యాటింగ్ ఆర్డర్‌లో టీమిండియాకు మరో తలనొప్పి ఉంది. ఎందుకంటే వైస్ కెప్టెన్ అయిన శుభ్‌‌మన్ గిల్‌ను కచ్చితంగా ఆడించాలి. అతను ఐపీఎల్‌లో ఓపెనర్‌గా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. స్ట్రైక్ రొటేట్ చేయగల ఒక ఆటగాడు జట్టుకు అవసరం. అందుకు శుభ్‌మన్ గిల్ సరిగ్గా సరిపోతాడు. కానీ శుభ్‌మన్ గిల్ స్ట్రైక్ రేట్ (139.28) సంజూ శాంసన్ కంటే గొప్పగా లేదు.

ఇది టీమిండియకు సవాలా? లేక శుభ్‌మన్ గిల్ నైపుణ్యాన్ని నమ్ముకొని బ్యాటింగ్ కాంబినేషన్‌ను ఎంపిక చేస్తారా? అనేది చూడాలి. అయితే స్ట్రైక్‌రేట్‌ మెరుగుపర్చుకునేందుకు శుభ్‌మన్ గిల్‌కు ఈ టోర్నీ మంచి అవకాశం ఉంది. నేను భారత టీ20 జట్టు గురించి మాత్రమే చర్చిస్తున్నాను. ఐపీఎల్‌లో మాత్రం శుభ్‌మన్ గిల్ మెరుగ్గా ఆడాడు,” అని ఆర్‌పీ సింగ్ చెప్పుకొచ్చాడు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-sanjay-manjrekar-sanjay-manjrekars-controversial-comments-on-rohit-sharma/sports/544074/

Asia Cup 2025 Breaking News fearless approach Indian Cricket Team latest news RP Singh comments Sanju Samson Shubman Gill strike rate comparison Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.