📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు చలాన్ పడగానే డబ్బు కట్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు భారీగా పెరిగిన బంగారం ధరలు ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ప్రజల్లో భయాందోళన 260 SSC ఆఫీసర్ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం ఇరాన్‌లో ఇంటర్నెట్ బ్యాన్ ..ప్రజలు విలవిలా రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల లక్ష వీసాలు రద్దు..దేశం నుంచి తరిమేస్తామని ట్రంప్ ప్రకటన ఈరోజు బంగారం ధరలు

Latest News: Chris Gayle – పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ నన్ను అవమానించింది: క్రిస్ గేల్

Author Icon By Anusha
Updated: September 8, 2025 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రికెట్‌లో యూనివర్సల్ బాస్‌గా పేరొందిన వెస్టిండీస్ లెజెండరీ ఆటగాడు క్రిస్ గేల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో తనకు జరిగిన చేదు అనుభవాలను తాజాగా బయటపెట్టాడు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో గడిపిన రోజులు తనకు మరపురాని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తనను దారుణంగా అవమానించిందని తెలిపాడు. సీనియర్ ఆటగాడినైన తనను ఓ పిల్లాడిలా చూసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పంజాబ్ టార్చర్ తట్టుకోలేక అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే ముందు తాను బోరున ఏడ్చానని క్రిస్ గేల్ గుర్తు చేసుకున్నాడు. అప్పటి పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ రిక్వెస్ట్ చేసినా.. తాను సీజన్ మధ్యలోనే స్వదేశం వెళ్లిపోయానని తెలిపాడు.

వేదనగా మిగిలిపోయాయని గేల్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌లు ఆడిన క్రిస్ గేల్ (Chris Gayle) తన ఐపీఎల్ కెరీర్‌ను 2021లో ముగించాడు. తన చివరి సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే పంజాబ్ తనకు అవకాశాలు ఇవ్వకుండా అవమానించిందని తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో క్రిస్ గేల్ ఆరోపించాడు.’పంజాబ్ కింగ్స్‌తో నా ఐపీఎల్ ప్రయాణం చాలా ముందుగానే ముగిసింది.

తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాను

నిజాయితీగా చెప్పాలంటే ఆ జట్టులో నాకు సరైన గౌరవం లభించలేదు. ఈ లీగ్ కోసం.. పంజాబ్ ఫ్రాంచైజీ కోసం ఓ సీనియర్ ఆటగాడిగా ఎంతో చేసిన నన్ను సరిగ్గా చూసుకోలేదు. నన్ను ఓ చిన్న పిల్లాడిలా ట్రీట్ చేశారు. నా భుజాలపై ఏదో బరువును మోస్తున్నట్లు అనిపించింది. ఫ్రాంచైజీ వైఖరి కారణంగా నేను తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాను. నా జీవితంలో తొలిసారి డిప్రెషన్ లాంటి భావన కలిగింది.

అందుకే ఎవరైనా డిప్రెషన్ గురించి మాట్లాడితే.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు కొంచెం అర్థమవుతుంది.పంజాబ్ కింగ్స్ (Punjab Kings) టార్చర్ భరించలేకపోయాను. వీలైనంత త్వరగా జట్టును వీడాలనుకున్నాను. డబ్బు కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యం అనిపించింది. అప్పటి కోచ్ అనిల్ కుంబ్లే‌కు ఫోన్ చేసి నా పరిస్థితిని చెప్పాను. అదే సమయంలో టీ20 ప్రపంచకప్ కూడా ఉంది. కరోనా కారణంగా బయో బబుల్‌లో ఉండటంతో బయటికి వెళ్లేందుకు కూడా ఆస్కారం లేదు. దాంతో నేను తీవ్ర మానసిక వేదనకు గురయ్యాను.

Latest News

పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ఆటగాళ్లను చూసుకునే విధానం తెలియదని

అది నన్ను మరింత గందరగోళానికి గురిచేసింది. ముంబై ఇండియన్స్‌తో ఆడిన నా చివరి మ్యాచ్ తర్వాత నేను ఆడటం సరికాదనిపించింది. ప్రశాంతత కరువైన చోటు ఉండి నన్ను నేను నాశనం చేసుకుంటున్నాననిపించింది.అనిల్ కుంబ్లేకు ఫోన్ చేసి మాట్లాడాను. ఆ సమయంలో నేను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాను. నిజం చెప్పాలంటే బోరున ఏడ్చేసాను. అప్పుడు ఫ్రాంచైజీ నడుస్తున్న తీరు.. అనిల్ కుంబ్లే ప్రవర్తన పట్ల నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. నేను కుంబ్లేకు ‘ధన్యవాదాలు మిత్రమా’అని చెప్పాను. రాహుల్ నాకు ఫోన్ చేసి.. జట్టులోనే ఉండాలని, తర్వాతి మ్యాచ్ ఆడుతావని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ నేను అంగీకరించలేదు.

మీ అందరికి మంచి జరగాలని చెబుతూ.. బ్యాగ్ సర్దుకొని వెళ్లిపోయాను.’అని గేల్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనుకోలేదా? అని యాంకర్ ప్రశ్నించగా.. వారు కోరుకోలేదు.. తాను రాలేదని బదులిచ్చాడు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ఆటగాళ్లను చూసుకునే విధానం తెలియదని, ఈ కారణంగా చాలా మంది ఆటగాళ్ళు ఆ జట్టులో ఆడటానికి ఇష్టపడరని కూడా గేల్ అభిప్రాయపడ్డారు.కరోనా కారణంగా ఐపీఎల్ 2021 రెండు దశల్లో జరిగింది.

ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గేల్

కరోనా వైరస్ కారణంగా అర్థాంతరంగా ఆగిపోయిన లీగ్.. యూఏఈ వేదికగా పూర్తి చేశారు. సెకండ్ ఫేజ్‌ మధ్యలోనే గేల్ జట్టును వదిలేసి వెళ్లిపోయాడు. సెకండాఫ్‌లో మూడు మ్యాచ్‌లకు రెండు మాత్రమే ఆడిన గేల్..మొత్తం 10 మ్యాచ్‌లు ఆడి 21.44 సగటుతో 193 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా 142 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గేల్ 39.72 సగటు, 148.92 స్ట్రైక్‌రేట్‌తో 4965 పరుగులు చేశాడు. 2018లో పంజాబ్ కింగ్స్ జట్టులో చేరిన గేల్.. 2021లో ఆ జట్టును వదిలేసాడు.

క్రిస్ గేల్ ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు?

గేల్ 21 సెప్టెంబర్ 1979న జమైకాలోని కింగ్స్‌టన్‌లో జన్మించాడు.

గేల్ ఏ రకం ఆటగాడు?

గేల్ ఎడమచేతి ఓపెనింగ్ బ్యాటర్. అదేవిధంగా ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేయగలడు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-shreyas-iyer-its-a-different-pain-if-there-is-no-place-in-the-team-shreyas-iyer/sports/543164/

Anil Kumble emotional moment Breaking News Chris Gayle Punjab Kings controversy Chris Gayle shocking allegations Chris Gayle vs Punjab franchise latest news Punjab Kings mistreatment Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.