📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Asia Cup 2025 షెడ్యూల్‌లో మార్పు.. కారణమిదే?

Author Icon By Anusha
Updated: August 30, 2025 • 6:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) 2025 ఆసియా కప్ (Asia Cup 2025) షెడ్యూల్‌లో భారీ మార్పులు చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు బరిలోకి దిగనున్నాయి. మొత్తం 18 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ దశ నుంచి సూపర్ ఫోర్ వరకు, చివరగా ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. అయితే తాజాగా మ్యాచ్‌ల సమయాల్లో మార్పు చేయడం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లు ఉన్నాయి. కానీ యూఏఈలో ప్రస్తుతం తీవ్ర ఎండలు, ఉక్కపోత కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆటగాళ్ల ఫిట్‌నెస్, ఆరోగ్యం దృష్ట్యా ACC ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అందుకే రాత్రి మ్యాచ్‌లను 8 గంటలకు, మధ్యాహ్నం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లను సాయంత్రం 5.30 గంటలకు జరగేలా మార్చారు. ఈ మార్పుతో ఆటగాళ్లు అధిక ఉష్ణోగ్రతల నుంచి కొంతవరకు ఉపశమనం పొందుతారని అధికారులు భావిస్తున్నారు.

ఆటగాళ్ల భద్రతే ప్రధాన ఉద్దేశ్యం

యూఏఈ వేదికగా టోర్నమెంట్ జరగడం వలన ఆటగాళ్ల శారీరక స్థైర్యంపై ఎండల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. దుబాయ్, షార్జా, అబుధాబి మైదానాల్లో సెప్టెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణంగా 40 డిగ్రీల వరకు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌లు మధ్యాహ్నం జరగడం కష్టం. కాబట్టి ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని సమయాల్లో మార్పు చేయడం ACC తీసుకున్న సరికొత్త అడుగుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.సెప్టెంబర్ 9న అబుదాబి వేదికగా అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగే తొలి మ్యాచ్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ (Defending champion) భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. యూఏఈ, పాకిస్థాన్, ఓమన్‌లతో భారత్ గ్రూప్‌-ఏలో ఉండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్ గ్రూప్‌ బీలో ఉన్నాయి. భారత్, పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే మూడు సార్లు తలపడనున్నాయి.

Latest News

రివైజ్డ్ షెడ్యూల్

సెప్టెంబర్ 9 – ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్, అబుదాబి – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 10 – భారతదేశం vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 11 – బంగ్లాదేశ్ vs హాంకాంగ్, అబుదాబి – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 12 – పాకిస్తాన్ vs ఒమన్, దుబాయ్ – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 13 – బంగ్లాదేశ్ vs శ్రీలంక (Bangladesh vs Sri Lanka), అబుదాబి – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 14 – భారతదేశం vs పాకిస్తాన్, దుబాయ్ – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 15 – యూఏఈ vs ఒమన్, అబుదాబి – సాయంత్రం 5:30 గంటలు,సెప్టెంబర్ 15 – శ్రీలంక vs హాంకాంగ్, దుబాయ్ – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 16 – బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్, అబుదాబి – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 17 – పాకిస్తాన్ vs యూఏఈ, దుబాయ్ – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 18 – శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్, అబుదాబి – రాత్రి 8 గంటలు.

ఆసియా కప్ 2025

సెప్టెంబర్ 19 – భారతదేశం vs ఒమన్, అబుదాబి – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 20 – B1 vs B2, దుబాయ్ – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 21 – A1 vs A2, దుబాయ్ – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 22 – విశ్రాంతి దినం,సెప్టెంబర్ 23 – A2 vs B1, అబుదాబి – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 24 – A1 vs B2, దుబాయ్ – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 25 – A2 vs B2, దుబాయ్ – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 26 – A1 vs B1, దుబాయ్ – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 27 – విశ్రాంతి దినం,సెప్టెంబర్ 28 – ఫైనల్, దుబాయ్ – రాత్రి 8 గంటలు,సెప్టెంబర్ 29 – రిజర్వ్ డే.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/latest-news-ms-dhoni-appointed-as-team-india-mentor/sports/538456/

acc match timing change asia cup 2025 fixtures Asia Cup 2025 schedule asia cup latest news Breaking News latest news Telugu News uae cricket tournament

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.