ఆసియా కప్ 2025 కోసం టీమిండియా జట్టును ప్రకటించినప్పటి నుంచి ఎన్నో చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా, జట్టులో స్థానం పొందని సీనియర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పేరు అభిమానులు, క్రికెట్ నిపుణుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నేళ్లుగా భారత జట్టులో కీలక స్థానాన్ని దక్కించుకున్న ఈ ఆటగాడు అకస్మాత్తుగా పక్కన పడేయబడటం చాలా మందికి అర్థం కాలేదు.శ్రేయస్ అయ్యర్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
టెస్ట్, వన్డే, టీ20 – ఏ ఫార్మాట్‌లోనైనా అతను తనదైన ముద్ర వేశాడు. ముఖ్యంగా మధ్య వరుసలో (Middle Order) స్థిరత్వం తీసుకొచ్చే ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి తన ఫామ్ నిరూపించుకున్నాడు. అంతేకాదు, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అర్హత మ్యాచ్‌లలోనూ మంచి ఆటతీరు చూపించాడు. ఇలాంటి ఆటగాడిని పక్కనబెట్టి, యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్కు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించింది.
అసాధారణ ప్రదర్శన కనబర్చినా శ్రేయస్ అయ్యర్‌ను సెలెక్టర్లు
అయ్యర్‌కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్దమైనట్లు తెలుస్తోంది. భారత్ ఏ జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ను సారథిగా ఎంపిక చేయాలని బోర్డు భావిస్తున్నట్లు బీసీసీఐ (BCCI) వర్గాలు పేర్కొన్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఐపీఎల్ 2024లో అసాధారణ ప్రదర్శన కనబర్చినా శ్రేయస్ అయ్యర్‌ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. శుభ్‌మన్ గిల్ కోసం అతన్ని భారత జట్టులోకి తీసుకోలేదు. దాంతో సెలెక్టర్లపై సర్వాత్ర విమర్శలు వచ్చాయి.
దాంతో తమ తప్పిదాన్ని సరిదిద్దుకునే క్రమంలోనే శ్రేయస్ అయ్యర్‌కు భారత్-ఏ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అనధికారిక టెస్ట్‌లతో పాటు వన్డేలు ఆడేందుకు ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత పర్యటనకు రానుంది. లక్నోలోని ఏక్‌నా స్టేడియంలో టెస్ట్‌లతో పాటు మూడు అనధికారిక వన్డే (ODI) ల్లోనూ ఇరు జట్లూ తలపడతాయి. ఈ సిరీస్‌లకు ఇంకా భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించలేదు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోనే జట్టును ఎంపిక చేయనున్నారని ఓ ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది.
వెస్ట్ జోన్‌కు సారథిగా వ్యవహరిస్తున్న
ఆసియాకప్ 2025 జట్టులో చోటు దక్కని శ్రేయస్ అయ్యర్.. దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీలో 2025లో వెస్ట్ జోన్‌కు ఆడుతున్న అయ్యర్.. తొలి ఇన్నింగ్స్‌లో 28 బంతుల్లో 25 పరుగులే చేసి వెనుదిరిగాడు. రుతురాజ్ గైక్వాడ్(184) భారీ శతకంతో రాణించగా.. యశస్వి జైస్వాల్(4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. వెస్ట్ జోన్‌కు సారథిగా వ్యవహరిస్తున్న శార్దూల్ ఠాకూర్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు. జగదీశన్, రజత్ పటీదార్ కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో ఆస్ట్రేలియా ఏతో జరిగే అనధికారిక టెస్ట్ సిరీస్‌కు వీరికి అవకాశం దక్కుతుందని క్రికెట్ వర్గాలు అనుకుంటున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Read also: