📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Asia Cup 2025 – ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

Author Icon By Anusha
Updated: September 6, 2025 • 12:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా క్రికెట్ అభిమానుల కోసం ఆసియాకప్ 2025 (Asia Cup 2025) టోర్నీ త్వరలోనే ప్రారంభంకానుండగా, మైదానాలను పూర్తి స్థాయిలో సిద్దం చేశారు. ఈ మెగా టోర్నీ సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. ఇంతకుముందు, టీమిండియా సుదీర్ఘంగా నెల రోజుల విరామం తీసుకున్న తర్వాత మళ్లీ మైదానంలో అడుగుపెట్టబోతుంది. ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత ఆటగాళ్లు క్రీడా యాక్టివిటీలలో పాల్గొనలేదు. అదేవిధంగా బంగ్లాదేశ్ పర్యటన రద్దు కావడంతో ఆటగాళ్లకు విరామం ఎక్కువకాలం వచ్చింది.

భారత్ జట్టు ఈ ఆసియాకప్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంగా 15 సభ్యులతో యూఏఈకి చేరింది. బుధవారం, జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొని క్రీడా పరిస్థితులను పరిశీలించింది. ప్రాక్టీస్ సౌకర్యాలు, ఫిట్‌నెస్, బ్యాటింగ్, బౌలింగ్ సారాంశాలను పరిశీలించి కోచ్‌లు, మేనేజ్‌మెంట్ టీమ్ అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్‌లో జరుగుతున్నది, అందువల్ల ఆటగాళ్లను పర్యవేక్షించడం, జట్టు శ్రేణులను సరిపరచడం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా భావిస్తున్నారు.

ఫైనల్ కీ ప్రోగ్రామ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు

ఈ ఏడాది ఆసియాకప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. భారత్ ఈ టోర్నీలో ఆతిథ్య యూఏఈ జట్టుతో సెప్టెంబర్ 10న తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తరువాత, సెప్టెంబర్ 14న దాయాదీ పాకిస్థాన్ జట్టుతో సమరాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. టోర్నీ మొత్తం రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో జరిగి, తరువాత సెమీఫైనల్స్, ఫైనల్ కీ ప్రోగ్రామ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సెప్టెంబర్ 9న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 10న ఆతిథ్య యూఏఈ (UAE) తో భారత్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. దాయాదీ పాకిస్థాన్‌తో సెప్టెంబర్ 14న తలపడనుంది.చివరిసారిగా ఆసియా కప్ 2023 వన్డే ఫార్మాట్‌లో జరగ్గా.. భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.

Latest News

టీ20 ఫార్మాట్‌లో ఎవర్నీ తక్కువ

2016లో తొలి టీ20 ఫార్మాట్‌లో నిర్వహించగా.. అప్పుడు కూడా భారత్ విజేతగా నిలిచింది. కానీ 2022లో మరోసారి టీ20 ఫార్మాట్‌లో నిర్వహించగా.. భారత్ కనీసం ఫైనల్ కూడా చేరలేదు. ఆ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలుస్తోంది. తాజా ఎడిషన్‌లో భారత్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. టీ20 ఫార్మాట్‌ (T20 format) లో ఎవర్నీ తక్కువ అంచనా వేయలేం. ఓవరాల్‌గా 16 సార్లు జరిగిన ఆసియా కప్‌లో భారత్ 8 టైటిళ్లు గెలిచింది. భారత్‌తో పాటు పాకిస్థాన్, యూఏఈ, ఒమన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, హాంగ్ కాంగ్, శ్రీలంకలు బరిలోకి దిగుతున్నాయి. ఒమన్ తొలిసారి ఆసియా కప్ ఆడనుండగా.. హాంగ్ కాంగ్(2018, 2022) రెండు సార్లు, యూఏఈ(2016) ఒక్కసారి ఆడింది.

జియో యూజర్స్

ఆసియా కప్ 2025 టోర్నీ బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ సోనీ నెట్‌వర్క్ దక్కించుకుంది. సోనీ టీవీ ఛానెల్స్‌తో పాటు ఆ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీ లైవ్‌లోనూ ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అయితే నేరుగా ఈ ఛానెల్స్‌, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో చూడాలనుకుంటే రుసుము చెల్లించుకోవాలి. అయితే జియో యూజర్స్, ఎయిర్టెల్ యూజర్స్.. జియో టీవీ, ఎయిర్టెల్ టీవీల సాయంతో ఈ మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రాత్రి 7.30 గంటలకు మొదలవ్వాల్సి ఉండగా.. యూఏఈలోని ఉక్కపోత కారణంగా అర గంట పొడిగించారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-cm-revanth-reddy-chief-minister-revanth-reddys-key-comments-on-mohammed-siraj/telangana/542318/

Asia Cup 2025 Breaking News India Cricket Team India vs Pakistan india vs uae latest news Suryakumar Yadav t20 tournament Team India Telugu News uae cricket

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.