📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Kumar Sangakkara: మళ్లీ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా కుమార సంగక్కర

Author Icon By Anusha
Updated: November 17, 2025 • 12:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం భారీ మార్పులు చేపట్టింది. జట్టు హెడ్ కోచ్‌గా శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర (Kumar Sangakkara) ను తిరిగి నియమించినట్లు యాజమాన్యం ప్రకటించింది. ఆయన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ బాధ్యతల్లోనూ కొనసాగుతారు. సంగక్కర గతంలో 2021 నుంచి 2024 వరకు రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గా పనిచేశారు.

Read Also: Gautam Gambhir: గంభీర్ పై నెటిజన్లు ఫైర్

Kumar Sangakkara is back as the head coach of Rajasthan Royals

సంగక్కర మాట్లాడుతూ

ఆయన హయాంలో జట్టు ప్రదర్శన మెరుగైంది. 2022లో ఫైనల్ చేరిన జట్టు, 2024లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. తన పునర్‌ నియామకంపై సంగక్కర (Kumar Sangakkara) మాట్లాడుతూ, “ఈ ప్రతిభావంతులైన జట్టుతో మళ్లీ పనిచేయడం గౌరవంగా ఉంది. స్పష్టమైన లక్ష్యంతో ఆడే జట్టును నిర్మించడమే మా ధ్యేయం” అని తెలిపారు.

విక్రమ్ రాథోడ్‌ను లీడ్ అసిస్టెంట్ కోచ్‌గా, షేన్ బాండ్‌ను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనున్నట్లు ఫ్రాంచైజీ వెల్లడించింది. సంగక్కర మార్గదర్శకత్వంలో కొత్త ఆటగాళ్లతో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సరికొత్త వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News IPL 2026 Kumar Sangakkara latest news Rajasthan Royals RR Team Changes Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.