📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Kuldeep Yadav – అక్షర్ పటేల్ ఇచ్చిన సలహాలతోనే వికెట్లు తీయగలిగా

Author Icon By Anusha
Updated: September 16, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) క్రికెట్ టోర్నీలో టీమిండియా స్పిన్ విభాగం మరింత బలంగా నిలుస్తోంది. ఇందులో ముఖ్యంగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) తన అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలో అతడు కనబరిచిన ప్రదర్శన వల్ల ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకోవడం గమనార్హం. యూఏఈపై జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌ను కూలదోసిన కుల్దీప్, ఆ తర్వాత పాకిస్థాన్‌పై జరిగిన కీలక పోరులో మూడు కీలక వికెట్లు సాధించి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.

కుల్దీప్ యాదవ్ బౌలింగ్ విశేషాలు ఈ సిరీస్‌లో టీమిండియా (Team India) కు మోక్షం లాంటివి అయ్యాయి. ముఖ్యంగా కీలక సమయాల్లో తీసిన వికెట్లు మ్యాచ్‌లను భారత్ వైపు తిప్పాయి. పాకిస్థాన్‌తో పోరులో అతడు సాధించిన మూడు వికెట్లు జట్టు విజయాన్ని సుస్థిరం చేశాయి. అంతేకాకుండా ఈ విజయాలు కుల్దీప్‌కు మరోసారి టీమిండియా స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో అతని స్థానం ఎంత ముఖ్యమో చూపించాయి.

ఈ వికెట్‌పై బంతి గ్రిప్ అవ్వడంతో పాటు స్పిన్ అవుతుందని

పాకిస్థాన్‌ (Pakistan) తో విజయానంతరం బీసీసీఐ (BCCI) తో మాట్లాడిన కుల్దీప్ యాదవ్.. అక్షర్ పటేల్ ఇచ్చిన సలహాలతోనే వికెట్లు తీయగలిగానని చెప్పాడు. తన కెప్టెన్ అక్షర్ పటేలేనని పేర్కొన్నాడు.అక్షర్ పటేల్ నా కెప్టెన్. ఈ వికెట్‌పై బంతి గ్రిప్ అవ్వడంతో పాటు స్పిన్ అవుతుందని అతనే చెప్పాడు. ఆ మాటలు నా మనసులో నాటుకుపోయాయి. అప్పటికీ నేను ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాను. బంతిని స్పిన్ చేయాలని ప్రయత్నించాను.

Kuldeep Yadav

కానీ బౌన్స్ లభించింది. అప్పటికే అక్షర్ పటేల్ (Axar Patel) రెండు వికెట్లు తీసాడు. నేను మూడు వికెట్లు పడగొట్టాను. ఇద్దరం కలిసి మేం ఐదు వికెట్లు పడగొట్టాం. ఇది జట్టు విజయానికి బాటలు వేసింది.నా అత్యుత్తమ ప్రదర్శన క్రెడిట్ అక్షర్ పటేల్‌కే ఇవ్వాలి. ఈ రోజు అతను కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌలింగ్ కండిషన్స్ (Bowling conditions) గురించి తెలుసుకోవడంతోనే ఎలా చేయాలనే ఆలోచన అక్షర్‌కు వచ్చిందేమో.

నెమ్మదిగా బౌలింగ్ చేయడంతో పాటు రివర్స్ చేశా

గత మ్యాచ్ తరహాలోనే ప్రతీ గేమ్‌లో వికెట్ భిన్నంగా ఉండనుంది. గత మ్యాచ్‌లో నా బౌలింగ్ వేగం బ్యాటర్లకు సులువు అవుతుందని భావించాను. ఈ విషయాన్ని ముందే గ్రహించి తొలి ఓవర్‌లోనే నెమ్మదిగా బౌలింగ్ చేయడంతో పాటు రివర్స్ చేశాను. ఆ వ్యూహం పనిచేసింది.సుదీర్ఘ కాలం తర్వాత ఆడినప్పుడు గొప్ప అనుభూతి కలుగుతోంది.

ఇంగ్లండ్ పర్యటనలో నాకు అవకాశం రాకున్నా.. నా ప్రాక్టీస్‌ను ఆపలేదు. ఫిట్‌నెస్‌పై కూడా ఫోకస్ పెట్టాను. స్పిన్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఆసియా కప్‌లో అవకాశం దక్కుతుందని నాకు ముందే తెలుసు. ఆ రిథమ్ కోల్పోకుండా కష్టపడ్డాను. ఆ కష్టానికి ప్రతి ఫలం దక్కుతుంది.’అని కుల్దీప్ యాదవ్ చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/hardik-pandya-dating-a-model/breaking-news/548303/

Asia Cup 2025 back to back player of the match Breaking News four wickets against uae kuldeep yadav brilliance latest news Team India Performance Telugu News three wickets against pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.