📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Kranti Goud: మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.1 కోటి నజరానా

Author Icon By Pooja
Updated: November 3, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్‌ను(ICC Women’s Cricket World Cup) తొలి సారిగా కైవసం చేసుకున్న భారత జట్టులోని యువ పేసర్ క్రాంతి గౌడ్(Kranti Goud) అద్భుత రాణింపుకు రాష్ట్ర ప్రభుత్వంగా పెద్దగౌరవం లభించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో తన ప్రభావవంతమైన బౌలింగ్‌తో అందరిచేత ప్రశంసలు అందుకున్న ఆమెకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.1 కోటి నగదు బహుమతి ప్రకటించింది. సోమవారం ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెల్లడించారు.

Read Also:  Mithali Raj: విజయం వెనుక నాలుగేళ్ల ప్రణాళిక నమ్మకం ఉన్నాయి

Kranti Goud

అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా రూ.1 కోటి బహుమతి

నవీ ముంబైలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. విజయం అనంతరం సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ, “మన మహిళలు ప్రపంచకప్‌లో భారత గౌరవాన్ని మరింత పెంచారు. ఆ జట్టులో మధ్యప్రదేశ్‌కు చెందిన క్రాంతి గౌడ్ ఉండటం మా రాష్ట్రానికి గర్వకారణం. ఆమె ప్రతిభను గుర్తిస్తూ రూ.1 కోటి బహుమానాన్ని ప్రకటిస్తున్నాం” అని అన్నారు. అలాగే, ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని, మహిళలు క్రీడల్లో చూపుతున్న ప్రతిభ కూడా దేశ గౌరవాన్ని పెంచుతోందని ఆయన అభినందించారు.

చతర్‌పూర్ జిల్లా బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల క్రాంతి గౌడ్(Kranti Goud) ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకం. సాధారణ పోలీస్ కానిస్టేబుల్ అయిన తండ్రిని ఆదర్శంగా తీసుకొని ఆర్థిక సమస్యల మధ్య కూడా క్రికెట్‌పై మక్కువను కొనసాగించింది. చిన్నతనం నుంచే అబ్బాయిలతో కలిసి టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ మొదలైన ఆమె ప్రయాణం, తరువాత లెదర్ బాల్ క్రికెట్‌లో ప్రతిభ చూపి జాతీయ స్థాయి గుర్తింపు పొందింది.

రైట్ ఆర్మ్ మీడియం పేసర్‌గా మధ్యప్రదేశ్ తరఫున రాణించిన క్రాంతి, 2025లో శ్రీలంకతో జరిగిన ట్రై–సిరీస్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇంగ్లండ్‌పై 52 పరుగులకు 6 వికెట్లు తీసి ఆమె అందరిని ఆకట్టుకుంది. ప్రపంచకప్‌లోనూ కీలక మ్యాచ్‌ల్లో రాణించి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Latest News in Telugu Today news WomenCricketWorldCup WomenInSports

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.