📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

News Telugu: Kolkata: సెల్ఫీల కోసం ఎగబడటంతో.. మెస్సీ తీవ్ర అసహనం

Author Icon By Rajitha
Updated: December 14, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel messi) కోల్‌కతా పర్యటనలో అనుకోని అసహనకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెస్సీ, మైదానంలోకి అడుగుపెట్టగానే రాజకీయ నాయకులు, ప్రముఖులు, కొందరు భద్రతా సిబ్బంది ఒక్కసారిగా వేదికపైకి ఎగబడటంతో గందరగోళం నెలకొంది. సెల్ఫీలు, ఫొటోల కోసం చుట్టుముట్టడంతో పరిస్థితి అదుపు తప్పింది. తొలుత ప్రశాంతంగా అభిమానులతో కరచాలనం చేస్తూ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన మెస్సీ, ఆ హడావుడితో అసౌకర్యంగా భావించారు.

Read also: Revanth reddy: రేవంత్ రెడ్డి మనవడు మెస్సీతో ఫుట్‌బాల్..

Messi was visibly annoyed as people swarmed him for selfies

సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే

పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో మెస్సీ సహనం కోల్పోయారు. ఆయనతో పాటు వచ్చిన లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా నిర్వాహకుల అవ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. ఈ గందరగోళం నేపథ్యంలో మెస్సీ కేవలం 20 నుంచి 25 నిమిషాల్లోనే మైదానాన్ని విడిచిపెట్టారు. తమ అభిమాన ఆటగాడిని సరిగా చూడలేకపోయిన ప్రేక్షకులు నిరాశ చెందగా, సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే ఈ ఘటనకు కారణమని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Kolkata incident latest news Lionel Messi Salt Lake Stadium Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.