📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Virat Kohli : కోహ్లి రిటైర్మెంట్.. తెలుగు సీఎంలు ఏమన్నారంటే?

Author Icon By Sudheer
Updated: May 12, 2025 • 7:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ కు గొప్ప సేవలందించిన విరాట్ కోహ్లి రిటైర్మెంట్ (virat kohli test retirement) ప్రకటించడంతో దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది. కోహ్లి అత్యుత్తమ ఆటగాడిగా మాత్రమే కాకుండా, అతని నిబద్ధత, క్రమశిక్షణ, పోటీదారుల్లో గౌరవం పొందేలా చేసిన నైజంతో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. అతని రిటైర్మెంట్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ స్పందన తెలియజేశారు.

చంద్రబాబు & రేవంత్ స్పందన

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) మాట్లాడుతూ..“విరాట్ కోహ్లి దేశానికి గర్వకారణం. అతడి రిటైర్మెంట్‌తో భారత క్రీడల చరిత్రలో ఒక అద్భుత అధ్యాయం ముగిసింది” అని తెలిపారు. కోహ్లి భారత క్రికెట్ కు ఇచ్చిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth) కూడా కోహ్లిని ప్రశంసిస్తూ, అతడి క్రమశిక్షణ, నిబద్ధత వల్లనే అనేక రికార్డులు సాధించగలిగాడని కొనియాడారు.

వైఎస్ జగన్ స్పందన

కోహ్లిపై మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా స్పందిస్తూ, “విరాట్ రికార్డులు అతడి గొప్పతనాన్ని చెబుతాయి. విరాట్ లెగసీ భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది,” అన్నారు. కోహ్లి ప్రతి మ్యాచ్ లో చూపిన నిబద్ధత, నాయకత్వం ఆటగాళ్లకే కాకుండా ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలిచింది. అతని క్రికెట్ జర్నీ యువతకు ఆదర్శంగా నిలుస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు.

Read Also : PM Modi: ఆపరేషన్ సింధూర్‌ తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోదీ సందేశం..

CM chandrababu CM Revanth Reddy Google News in Telugu Virat Kohli virat kohli test retirement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.