Latest News: Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న కోహ్లీ

Read Time:  1 min
Latest News: Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్న కోహ్లీ
FONT SIZE
GET APP

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ చాలా కాలం తర్వాత దేశ‌వాళీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో అతను ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు రోహన్ జైట్లీ ధృవీకరించారు.

Read Also: Football Academy: మహిళా ఫుట్‌బాల్ అకాడమీ

Kohli to play in Vijay Hazare Trophy
Kohli to play in Vijay Hazare Trophy

“విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు విరాట్ కోహ్లీ (Virat Kohli) తన అంగీకారాన్ని మాకు తెలియజేశాడు” అని రోహన్ జైట్లీ ఐఏఎన్ఎస్‌ వార్తా సంస్థతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ఈ టోర్నమెంట్ డిసెంబర్ 24 నుంచి జనవరి 18 వరకు జరగనుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని రాక, దేశవాళీ టోర్నీలలో పేలవ ప్రదర్శనతో సతమతమవుతున్న ఢిల్లీ జట్టుకు పెద్ద ఊరటనివ్వనుంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.