AB de Villiers on Virat Kohli: RCB కి కోహ్లీనే ఊపిరి: ఏబీ డివిలియర్స్

Read Time:  1 min
AB de Villiers on Virat Kohli: RCB కి కోహ్లీనే ఊపిరి: ఏబీ డివిలియర్స్
FONT SIZE
GET APP

AB de Villiers on Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో అత్యంత క్రేజ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. ఈ జట్టు గురించి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి సౌతాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ జియో హాట్‌స్టార్ షోలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Read Also: Dinesh Karthik-Dipika Pallikal: మూడోసారి తండ్రైన క్రికెటర్ దినేశ్ కార్తీక్

కోహ్లీ కేవలం ఆటగాడు కాదు.. ఒక శక్తి!

విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌తో కాకుండా తన ఉనికితో జట్టులో శక్తిని నింపుతాడని, ఆట కోసం అతని చూపే క్రమశిక్షణ అద్బుతమని కొనియాడాడు. కోహ్లీ మైదానంలో చూపించే ఉత్సాహం, గెలుపు కోసం పడే తపన యువ ఆటగాళ్లకు గొప్ప స్ఫూర్తినిస్తుందన్నాడు. గతంలో ఆర్‌సీబీ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపైనే ఆధారపడేదని, కానీ గత సీజన్‌లో జట్టు మొత్తం సమష్టిగా రాణించి విజేతగా నిలిచిందన్నాడు.’కోహ్లీ తన బ్యాటింగ్‌తోనే కాకుండా తన ఉనికితో జట్టులో నింపే శక్తి అమోఘం. అతను జట్టును నడిపించే తీరు, క్రమశిక్షణ చూస్తుంటే ముచ్చటేస్తుంది.

Kohli is the lifeblood of RCB: AB de Villiers
Kohli is the lifeblood of RCB: AB de Villiers

ఐపీఎల్ 2026 అంచనాలు

గతంలో ఆర్‌సీబీ ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లపైనే ఆధారపడేదని, కానీ 2025లో జట్టు మొత్తం సమిష్టిగా రాణించి విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లీ(657) టాప్ రన్ స్కోరర్‌లలో ఒకడిగా నిలవడమే కాకుండా.. రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, రోమారియో షెపర్డ్ వంటి వారు అద్భుత ప్రదర్శన చేశారు. బంతితో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు.నేను నా జీవితంలో చూసిన అత్యుత్తమ వర్క్ ఎథిక్ కోహ్లీదే. అతను టోర్నమెంట్‌లోకి ఎప్పుడూ పూర్తి సన్నద్ధతతో వస్తాడు. ఒకవేళ అతను రాణించకపోతే అది కేవలం ఫామ్ సమస్య లేదా టెక్నికల్ లోపం వల్లనే అవుతుంది తప్ప, ప్రాక్టీస్ లేక కాదు. విరాట్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈసారి కూడా ఆర్‌సీబీ వరుసగా రెండో టైటిల్ నెగ్గే అవకాశం ఉంది.’అని ఏబీ డివిలియర్స్ తెలిపాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.