हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News:  Mohammed Kaif: రోహిత్‌తో పోల్చితే కోహ్లీనే నిలకడగా ఆడుతాడు: మహమ్మద్ కైఫ్

Aanusha
Latest News:  Mohammed Kaif: రోహిత్‌తో పోల్చితే కోహ్లీనే నిలకడగా ఆడుతాడు: మహమ్మద్ కైఫ్

భారత క్రికెట్‌లో జట్టు ఎంపిక విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనకు ముందే మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) సంచలన వ్యాఖ్యలు చేసాడు. కైఫ్ ప్రధానంగా టీమిండియా ఎంపికలను, ప్రత్యేకంగా రోహిత్ శర్మ (Rohit Sharma) ఫామ్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.రోహిత్ శర్మ ఎప్పుడూ విరాట్ కోహ్లీ (Virat Kohli) వంటి స్థిరమైన ఫామ్‌ని చూపలేదని ఆయన వ్యాఖ్యానించారు.

KL Rahul: కాంతార చాఫ్ట‌ర్ 1 పై కేఎల్ రాహుల్ ప్ర‌శంస‌లు

కానీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడని గుర్తు చేశాడు.టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కేవలం వన్డే (ODI) ల్లోనే కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్‌తో ఈ ఇద్దరూ స్టార్లు టీమిండియా (Team India) లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు.

మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టులో కొనసాగుతారని

టీమిండియా వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మ తప్పించి శుభ్‌మన్ గిల్‌ (Shubman Gill) ను కొత్త సారథిగా నియమించారు.దాంతో మెరుగైన ప్రదర్శన చేస్తేనే జట్టులో కొనసాగుతారని కోహ్లీ, రోహిత్‌కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తోనే కోహ్లీ, రోహిత్‌పై ఓ అంచనాకు రావడం సరికాదని కైఫ్ అభిప్రాయపడ్డాడు.

 Mohammed Kaif
Mohammed Kaif

వన్డే ప్రపంచకప్ 2027 (ODI World Cup 2027)లో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడటం టీమిండియాకు కీలకమని చెప్పాడు.’ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ ఫామ్‌ను పరిశీలిస్తారని అంటున్నారు. కానీ రోహిత్ శర్మకు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే రోహిత్ ప్రస్తుతం కెప్టెన్‌ కాదు. అతను ఏనాడు కూడా నిలకడగా రాణించింది లేదు. 20, 30 పరుగులే చేస్తాడు.

రోహిత్ తనదైన రోజున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు

అతని కెరీర్ మొత్తం అలానే సాగింది.రోహిత్‌తో పోల్చితే కోహ్లీనే నిలకడగా ఆడాడు. కానీ రోహిత్ తనదైన రోజున మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేస్తాడు. కాబట్టి ఒక్క ఆస్ట్రేలియా సిరీస్‌ (Australia series) తో రోహిత్ ఫామ్‌ను అంచనా వేయడం కష్టం. ఒకవేళ ఈ సిరీస్‌లో రోహిత్ విఫలమైతే.. అతను ఫామ్‌లో లేడని విమర్శలు గుప్పిస్తారు.

కానీ మీరు అతను కెరీర్‌ను పరిశీలిస్తే అతను తరుచుగా రెండు, మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలమై.. ఆ తర్వాత బలంగా తిరిగి వస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) లో కూడా అతను ఆరంభ మ్యాచ్‌ల్లో 30, 40 పరుగులు చేసాడు. కానీ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.వన్డే ప్రపంచకప్ 2027లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఆడించాలి.

మెగా టోర్నీల్లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అవసరం

మెగా టోర్నీల్లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అవసరం. వారికి సరైన గౌరవం దక్కలేదని భావించడం, రిటైర్మెంట్ తీసుకోవడం వారి వ్యక్తిగత నిర్ణయం. కానీ వారిద్దరూ ప్రపంచకప్ ఆడితే భారత్ గౌరవం పెరగుతుంది.

అంతేకాకుండా వారి నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు వస్తాయి. నా ఏకైక విజ్ఞప్తి ఏంటంటే.. రెండు లేదా మూడు ఇన్నింగ్స్‌ల ఆధారంగా వారిని అంచనా వేయవద్దు.’అని కైఫ్ (Mohammed Kaif) చెప్పుకొచ్చాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870