మొన్నటి వరకు పూమా (Puma) ప్రమోట్ చేసిన విరాట్ కోహ్లి, ఇప్పుడు అజిలిటాస్ (Agilitas) బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టాడు. 2017 సంవత్సరంలో పూమాతో అగ్రిమెంట్ చేసుకున్నాడు (Virat Kohli) విరాట్ కోహ్లి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బ్రాండ్ ప్రమోట్ చేశాడు. ఇకపై అజిలిటాస్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగనున్నాడు కోహ్లి.
Read Also: MS Dhoni: ధోనీ భారత్‌లో పుట్టినందుకు మనమందరం గర్వపడాలి: మురళీ విజయ్
లేటెస్ట్ గా జరిగిన ఒప్పందం ప్రకారం
అలాగే సొంతంగా వన్8 అనే కంపెనీని కూడా ప్రారంభించాడు. ఇది స్పోర్ట్స్‌వేర్, ఫుట్‌వేర్, దుస్తులు వంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అజిలిటాస్‌ను అభిషేక్ గంగూలీ ప్రారంభించాడు. అతడు గతంలో పూమా ఇండియా, సౌత్‌ఈస్ట్ ఆసియాకు మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేశాడు.
అజిలిటాస్ కోసం పూమా ఆఫర్ చేసిన రూ.300కోట్ల ఒప్పందాన్ని విరాట్ (Virat Kohli) తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇక గతంలో అజిలిటాస్ లో దాదాపు 40 కోట్ల పెట్టుబడులు కూడా విరాట్ కోహ్లి పెట్టాడట. లేటెస్ట్ గా జరిగిన ఒప్పందం ప్రకారం తన సొంత బ్రాండ్ వన్ 8 ప్రొడక్ట్స్ కూడా అజిలిటాస్ ద్వారా కస్టమర్లకు అందుబాటులో దానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: