📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: KL Rahul: టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు

Author Icon By Aanusha
Updated: October 4, 2025 • 9:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) మరోసారి తన క్లాస్‌ను చాటుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రాహుల్ అద్భుతమైన శతకాన్ని నమోదు చేశాడు.

అయితే ఈ సెంచరీతో పాటు టెస్ట్ క్రికెట్‌ (Test cricket) లో ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడం రాహుల్ ప్రత్యేకత. టెస్ట్ క్రికెట్ 148 ఏళ్ల చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో రెండుసార్లు 100 పరుగుల వద్ద ఔటైన తొలి ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు.

Dhruv Jurel:వెస్టిండీస్‌తో టెస్టులో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తొలి సెంచరీ

197 బంతుల్లో 12 ఫోర్లతో 100 పరుగులు సాధించిన అతను, ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఈ ఏడాది (2025) రాహుల్ ఇలా 100 పరుగుల వద్ద ఔటవడం ఇది రెండోసారి. జులైలో ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టులో కూడా అతను సరిగ్గా 100 పరుగులకే వెనుదిరిగాడు.

1877లో టెస్ట్ క్రికెట్ (Test cricket in 1877) ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఒకే సంవత్సరంలో రెండుసార్లు ఇలా 100 పరుగుల వద్ద ఔటవలేదు.ఈ మ్యాచ్‌లో రాహుల్ సాధించింది అతని కెరీర్‌లో 11వ టెస్ట్ సెంచరీ కాగా, స్వదేశంలో ఇది రెండోది మాత్రమే.

KL Rahul

భారత గడ్డపై అతను శతకం చేయడం ఇదే తొలిసారి

2016 తర్వాత భారత గడ్డపై అతను శతకం చేయడం ఇదే తొలిసారి.మ్యాచ్ అనంతరం రాహుల్ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ (England) వంటి భిన్నమైన పరిస్థితుల్లో ఆడటం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పాడు. “విరామం తర్వాత తిరిగి మైదానంలోకి రావడం ఆనందంగా ఉంది. ఇంగ్లాండ్‌లో పరుగులు చేయడం మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది.

ఇక్కడి పరిస్థితులు శారీరకంగా సవాలు విసిరాయి. ఈ సెంచరీని నా కూతురికి అంకితం ఇస్తున్నాను” అని రాహుల్ తెలిపాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో రాహుల్ 10 ఇన్నింగ్స్‌లలో 532 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

100 runs out twice Ahmedabad Test Breaking News cricket history KL Rahul KL Rahul Century latest news rare record Telugu News Test Cricket West Indies vs India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.