సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. ఆదివారం రాంచీ వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య భారత్, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా తాత్కలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) శనివారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తుది జట్టు ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ ఎలెవన్‌ను ఇంకా ఖరారు చేయలేదని ఆదివారమే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.
Read Also: Kapil Dev: టెస్టుల్లో బ్యాటింగ్ అంటే క్రీజులో పాతుకుపోవడమే: కపిల్ దేవ్
ODI సందర్భంగా ప్రెస్‌తో మాట్లాడారు
రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ ఆడే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. SAతో టెస్ట్ సిరీస్ ఓటమిని మర్చిపోయి ODI సిరీస్ గెలవడంపై దృష్టి పెడతామని టీమ్ ఇండియా కెప్టెన్ KL రాహుల్ (KL Rahul) అన్నారు. రేపు SAతో తొలి ODI సందర్భంగా ప్రెస్‌తో మాట్లాడారు.
‘రోహిత్, కోహ్లీ ఉండటం వల్ల డ్రెస్సింగ్ రూమ్‌లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ సిరీస్‌లో రుతురాజ్‌కు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. పంత్ ఆడితే అతడే కీపర్ బాధ్యతలు తీసుకుంటాడు. స్పిన్‌ను బెటర్‌గా ఆడటంపై దృష్టిపెడుతున్నాం’ అని పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: