हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Latest News: KL Rahul: టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

Aanusha
Latest News: KL Rahul: టీమిండియా ఓటమి.. కెప్టెన్ ఏమన్నాడంటే?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించిన సౌతాఫ్రికా 4 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. మ్యాచ్ అనంతరం ఓటమిపై స్పందించిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul).. రెండో ఇన్నింగ్స్‌లో విపరీతంగా కురిసిన మంచు బౌలింగ్‌ను కష్టతరం చేసిందని, టాస్ ఓడిపోవడం తమ ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.

Read Also: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌కి టీమిండియా జెర్సీ విడుదల

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ సెంచరీలతో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ (66 నాటౌట్) రాణించడంతో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అయితే, ఛేదనలో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ (110) శతకంతో చెలరేగగా, మాథ్యూ బ్రీట్జ్‌కే (68),

డెవాల్డ్ బ్రెవిస్ (54) రాణించడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.”ఈ ఓటమిని జీర్ణించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎంతగా ఉందంటే బౌలింగ్ చేయడం చాలా ఇబ్బందిగా మారింది. అంపైర్లు బంతిని కూడా మార్చారు. టాస్ కీలక పాత్ర పోషించింది.

KL Rahul: Team India's defeat.. What did the captain say?
KL Rahul: Team India’s defeat.. What did the captain say?

350 పరుగులు మంచి స్కోరే

టాస్ ఓడిపోయినందుకు నన్ను నేనే నిందించుకుంటున్నా” అని రాహుల్ (KL Rahul). నవ్వుతూ అన్నాడు.అయితే, బౌలర్లు, ఫీల్డర్లు మరింత మెరుగ్గా ఆడాల్సిందని రాహుల్ అభిప్రాయపడ్డాడు. “350 పరుగులు మంచి స్కోరే అయినా, బౌలర్లకు మరిన్ని అదనపు పరుగులు అందించేందుకు ఇంకో 20-25 పరుగులు చేసి ఉంటే బాగుండేదని డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చించుకున్నాం” అని తెలిపాడు.

రుతురాజ్, కోహ్లీ భాగస్వామ్యం అద్భుతంగా ఉందని, ముఖ్యంగా రుతురాజ్ యాభై పరుగులు దాటాక వేగం పెంచిన తీరు ప్రశంసనీయమని అన్నాడు. తాను ఆరో స్థానంలో కాకుండా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై స్పందిస్తూ.. భాగస్వామ్యం కుదిరిన సమయంలో అదే వేగాన్ని కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870