ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఓ అరుదైన అనుభవాన్ని పొందాయి. బ్రిటన్ రాజు ఛార్లెస్-3ని వారు మర్యాదపూర్వకంగా కలసి, అతని సాన్నిధ్యంలో గడిపారు. మంగళవారం నాడు క్లారెన్స్ హౌస్ గార్డెన్‌లో ఈ సమావేశం జరిగింది.పురుషుల జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బుమ్రా, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లు రాజుతో కలసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ సందర్భంగా చార్లెస్ (King Charles) మిత్రుడిలా మాట్లాడుతూ పలువురు ఆటగాళ్లతో నవ్వులు పంచుకున్నారు. మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కూడా రాజు స్నేహపూర్వకంగా సంభాషించారు.
లార్డ్స్ మ్యాచ్ గురించి చర్చ – గిల్‌తో చార్లెస్ ప్రశ్న
రాజు తాజా మూడో టెస్ట్ మ్యాచ్‌ను చూశానని చెప్పి గిల్‌ను అడిగిన ప్రశ్న ఆసక్తికరంగా మారింది. చివరి బ్యాటర్ అలా అవుట్ కావడం ఎలా అనిపించింది?” అని ప్రశ్నించారు. దీనికి శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)“చాలా బాధాకరమైంది. కానీ వచ్చే రెండు మ్యాచ్‌లపై ఆశలు ఉన్నాయ్ అని సమాధానమిచ్చారు.రాజుతో మాట్లాడిన అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ తన అనుభవాన్ని పంచుకుంటూ, “చార్లెస్ ఎంతో అనురాగంగా, ఆత్మీయంగా మాట్లాడారు. ఇది మర్చిపోలేని క్షణం” అని చెప్పారు. ఆటగాళ్లందరికీ ఇది గుర్తుండిపోయే సంఘటనగా మారిందని పేర్కొన్నారు.
సిరాజ్ అవుట్ – మ్యాచ్ మలుపు తిరిగిన క్షణం
ఇక లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ హైలైట్ మాత్రం స్పిన్నర్ బషీర్ వేసిన ఒక బంతి. టీ బ్రేక్ తర్వాత సిరాజ్ బ్యాక్‌ఫుట్ డిఫెన్స్ ఆడే క్రమంలో బంతి లెగ్ స్టంప్‌ను తాకింది. వెంటనే బెయిల్స్ పడిపోవడంతో సిరాజ్ అవుట్ అయ్యాడు. ఈ ఔట్‌తో ఇంగ్లండ్ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. ఒక వేళ సిరాజ్ నిలబడి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న ఆశాభావం అభిమానుల్లో ఉంది.
Read Also : Andhra Pradesh : వరల్డ్ ఫుడ్ ఇండియా భాగస్వామిగా ఏపీ