Khelo India Tribal Games: గిరిజన క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర క్రీడాశాఖ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ (KITG) నిర్వహణకు సిద్ధమైంది. ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్ ఈ నెల 25న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు జరగనుంది. కేంద్ర క్రీడా శాఖ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), భారత ఒలింపిక్ సంఘం (IOA) , నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లు సంయుక్తంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్నాయి.
Read Also: T20 WC: అభిషేక్ శర్మ త్వరలోనే పుంజుకుంటాడు: కపిల్ దేవ్
ఛత్తీస్‌గఢ్ వేదికగా గిరిజన విన్యాసాలు
ఈ ఏడాది క్రీడలకు గిరిజన సంస్కృతికి నిలయమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తోంది. రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణలో రాయ్‌పూర్, జగ్‌దల్‌పూర్, సర్గుజా ప్రాంతాల్లోని క్రీడా మైదానాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఏడు మెడల్ స్పోర్ట్స్ (అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, ఆర్చరీ, స్విమ్మింగ్, రెజ్లింగ్)తో పాటు మల్లఖంభ్ (కర్ర ఆధారంగా ఆడే సంప్రదాయ క్రీడ), కబడ్డీ క్రీడలను ఆడించనున్నారు.
తొలి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ రికార్డు
ప్రత్యేకంగా గిరిజన అథ్లెట్ల కోసమే కేటాయించిన ఈ జాతీయ స్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ చరిత్ర సృష్టించనుంది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘ఖేలో ఇండియా’ పథకంలో భాగంగా ఈ గిరిజన క్రీడలను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ గిరిజన యువతకు గొప్ప అవకాశాలను కల్పిస్తుందని, వారి సాధికారతకు బాటలు వేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: