Kerala High Court-IPL Name Case: ఐపీఎల్ 2026 సీజన్ కౌంట్‌డౌన్ మొదలైన వేళ, ఈ టోర్నీ పేరుపై గత కొంతకాలంగా సాగుతున్న వివాదానికి తెరపడింది. ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ అనే పేరులో ‘ఇండియన్’ అనే పదాన్ని వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు తోసిపుచ్చింది.
Read Also: AB de Villiers on Virat Kohli: RCB కి కోహ్లీనే ఊపిరి: ఏబీ డివిలియర్స్
పిటిషన్ నేపథ్యం
సామాజిక కార్యకర్త, అశిక్ కరోత్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో ఒక వింత పిటిషన్ వేశారు. బీసీసీఐ తన ప్రైవేట్ టీ20 లీగ్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే పేరును ఉపయోగించడం చట్టవిరుద్ధమని ఆయన వాదించారు. అయితే చీఫ్ జస్టిస్ సౌమెన్ సేన్, జస్టిస్ శ్యామ్ కుమార్ వి.ఎంలతో కూడిన ధర్మాసనం ఈ వాదనను ఏమాత్రం అంగీకరించలేదు. ఐపీఎల్ అనేది దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రాండ్ అని, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు పేరుపై అభ్యంతరం వ్యక్తం చేయడం అర్థరహితమని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌లో ఎలాంటి పస లేదని చెబుతూ దానిని కొట్టివేసింది.

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: