हिन्दी | Epaper
షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ!

Kavya Maran: సోషల్ మీడియా మీమ్స్‌పై స్పందించిన కావ్య మారన్

Sharanya
Kavya Maran: సోషల్ మీడియా మీమ్స్‌పై స్పందించిన కావ్య మారన్

కావ్య మారన్ క్రికెట్ అభిమానుల్లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రత్యేకంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఫ్యాన్స్‌కి అయితే ఆమె పరిచయం అవసరం లేదు. మ్యాచ్ జరుగుతుందంటే చాలు, కెమెరాలు పదేపదే ఆమె ముఖాన్ని క్యాచ్ చేయడం, తర్వాత ఆ హావభావాలు మీమ్‌లుగా సోషల్ మీడియాలో తిరుగుతుండడం చూస్తూనే ఉంటారు. అయితే ఈ మీమ్‌ల గురించి కావ్య మారన్ తొలిసారిగా ప్రత్యక్షంగా స్పందించడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది.

Kavya Maran: సోషల్ మీడియా మీమ్స్‌పై స్పందించిన కావ్య మారన్
Kavya Maran: సోషల్ మీడియా మీమ్స్‌పై స్పందించిన కావ్య మారన్

క్రికెట్‌పై ప్రేమ, కెమెరా ఫోకస్‌కు కారణం!

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కావ్య మారన్ (Kavya Maran) ఇలా చెప్పారు. “క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మా జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రయత్నిస్తాను. కేవలం హైదరాబాద్‌లోనే కాదు, అహ్మదాబాద్, చెన్నై లాంటి వేరే నగరాల్లో మ్యాచ్‌లు జరిగినప్పుడు కూడా ఆటగాళ్లను ఉత్సాహపరిచేందుకు వెళ్తాను. నేను స్టాండ్స్‌లో ఎక్కడో దూరంగా కూర్చున్నా, కెమెరామెన్ నా హావభావాలను పదేపదే బంధిస్తుంటారు. బహుశా ఆటపై నాకున్న ఈ మక్కువ వల్లే నేను కెమెరా కంటికి చిక్కుతున్నాను. అవే మీమ్స్‌గా మారుతున్నాయి” అని కావ్య మారన్ వివరించారు.

జట్టు యజమాని మాత్రమే కాదు, ఫ్యాన్ కూడా!

కావ్య మారన్ SRH సహ యజమాని అయినప్పటికీ, ఆ జట్టుకు పెద్ద అభిమాని కూడా. మ్యాచ్ గెలిచినా, ఓడినా ఆమె చూపించే స్పందనలు అభిమానులను ఆకట్టుకుంటాయి. కొన్ని కీలక సందర్భాల్లో ఆమె డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లలో స్ఫూర్తి నింపే ప్రసంగాలు కూడా ఇస్తుంటారు. ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్, హెన్రిచ్ క్లాసెన్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్న సన్‌రైజర్స్ జట్టుకు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో అభిమానులున్నారు.

SRH విజయాల నేపథ్యంలో

2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో SRH జట్టు తమ తొలి ఐపీఎల్ టైటిల్‌ను సాధించింది. 2018లో వేదిక హైదరాబాద్ కాగా, జట్టు రెండో సారి ఫైనల్‌కు చేరింది. 2024లో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలో SRH మరోసారి ఫైనల్ చేరుకుని రన్నరప్‌గా నిలిచింది. ట్రావిస్ హెడ్, క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, నితీష్ రాణా లాంటి ఆటగాళ్లతో SRH జట్టు బలంగా ఎదుగుతోంది.

Read also: Yashasvi Jaiswal: రాబోయే సీజన్‌లో ముంబై జట్టుతోనే ఆడనున్న యశస్వి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870