దక్షిణ భారత సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh), ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యమారన్ (Kavya Maran) మధ్య ప్రేమాయణం నడుస్తోందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం పుకార్లుగా మాత్రమే ఉన్న ఈ వార్తలు తాజాగా మరింత బలం పుంజుకున్నాయి. కారణం – న్యూయార్క్ వీధుల్లో ఇద్దరూ కలసి కనిపించడం!
Read Also: IND vs SA: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?
ఒక అమెరికన్ యూట్యూబర్ న్యూయార్క్ సిటీ వీధుల్లో వీడియో చిత్రీకరిస్తుండగా అనుకోకుండా కెమెరాలో అనిరుధ్ (Anirudh), కావ్యమారన్ చిక్కారు. ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుతూ రోడ్డు మీద నడుస్తున్న దృశ్యం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ యూట్యూబర్ ఆ వీడియోను తన ఛానల్‌లో అప్‌లోడ్ చేయగానే, నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురుస్తోంది.
సీక్రెట్ లవర్స్ దొరికేశారు
“సీక్రెట్ లవర్స్ దొరికేశారు!” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ వేదికల వద్ద మాత్రమే కనిపించే కావ్యమారన్.. ఇలా అనిరుధ్‌తో కలిసి న్యూయార్క్ వీధుల్లో స్వేచ్ఛగా తిరగడం చూస్తుంటే.. వీరిద్దరి మధ్య బంధం కేవలం స్నేహం మాత్రమే కాదని.. అంతకు మించి ఏదో ఉందని చర్చ జోరందుకుంది.
వచ్చే ఏడాదిలోనే వీరి వివాహం జరగబోతోందని, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతోనే ఇది జరుగుతుందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే, గతంలో ఈ వార్తలు వచ్చినప్పుడు అనిరుధ్ టీమ్ స్పందించింది. వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని, వారి మధ్య ప్రేమ వంటిదేమీ లేదని స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: