📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Karsan Ghavri: కోహ్లీ, రోహిత్‌ల టెస్ట్ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రి ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: August 16, 2025 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్ట్ క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలకడం ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నిర్ణయం వారు స్వచ్ఛందంగా తీసుకోలేదని, బీసీసీఐ (BCCI) అంతర్గత రాజకీయాల వల్లే రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చిందని భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘవ్రి సంచలన ఆరోపణలు చేశారు.2025 మే నెలలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు కొన్ని రోజుల ముందు కోహ్లీ, రోహిత్‌లు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన భారత క్రికెట్ వర్గాల్లో షాక్ వేవ్స్ సృష్టించగా, ఇప్పుడు ఘవ్రి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ అంశాన్ని చర్చకు తెచ్చాయి. ఆయన ప్రకారం, కోహ్లీ, రోహిత్‌ (Kohli and Rohit) లు ఇంకా రెండేళ్లు సులభంగా ఆడగల సామర్థ్యం ఉన్నప్పటికీ, సెలక్షన్ కమిటీ, బీసీసీఐలోని కొందరి కుట్రల కారణంగా వారిని బలవంతంగా తప్పించారని ఆరోపించారు.

భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలు

“బీసీసీఐలోని అంతర్గత రాజకీయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈ కుటిల రాజకీయాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. నిజానికి కోహ్లీ, రోహిత్‌లు ఇంకా ఆడాలని అనుకున్నారు. కానీ సెలక్టర్లు వేరే ఆలోచనలో ఉన్నారు. అందువల్లే వారికి రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది” అని ఘవ్రి (Karsan Ghavri) ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.ఇంత పెద్ద స్థాయికి ఎదిగి, భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలు అందించిన విరాట్ కోహ్లీకి కనీసం ఒక వీడ్కోలు మ్యాచ్ ఇవ్వకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. “కోహ్లీ లాంటి ఆటగాడు ఇంకా రెండేళ్లు కనీసం టెస్ట్ క్రికెట్‌లో కొనసాగగలడు. కానీ ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.

Karsan Ghavri

త్వరలోనే వన్డేల నుంచి కూడా తప్పుకోవచ్చని

ఇది కేవలం ఒక ఆటగాడి వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు, కోట్లాది అభిమానుల నిరాశ కూడా. ఇంతటి క్రికెట్ దిగ్గజానికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాల్సింది. కానీ బీసీసీఐ ఆ గౌరవాన్ని కూడా ఇవ్వలేదు” అని ఘవ్రి ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు త్వరలోనే వన్డేల నుంచి కూడా తప్పుకోవచ్చని, దాంతో 2027 ప్రపంచకప్ ఆడే అవకాశం కోల్పోతారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఘవ్రి చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, వన్డే ఫార్మాట్‌లో విరాట్ 14,181 పరుగులు, రోహిత్ 11,168 పరుగులు చేసి భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు.

కర్సన్ ఘవ్రి ఎవరు?

కర్సన్ ఘవ్రి భారత మాజీ క్రికెటర్. 1970లలో టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా ఆడారు.

కర్సన్ ఘవ్రి అభిప్రాయం వెనుక ప్రధాన అంశం ఏమిటి?

ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు త్వరలోనే వన్డేల నుంచి కూడా తప్పుకోవచ్చని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/saliya-saman-five-year-ban-on-saliya-saman-for-match-fixing-allegations/international/530933/

BCCI politics Breaking News Indian cricket controversy Karsan Ghavri statement latest news Rohit Sharma Retirement Telugu News Test cricket retirement virat kohli retirement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.