📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Karsan Ghavri: గవాస్కర్ ఎవరి మాట వినడు: కర్సన్

Author Icon By Anusha
Updated: August 18, 2025 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్ చరిత్రలో “లిటిల్ మాస్టర్” అని పిలవబడే సునీల్ గవాస్కర్‌ గురించి ఎన్నో గాధలు ఉన్నాయి. ఆయన క్రమశిక్షణ, కష్టపడి సాధన చేసే తీరు, ఆటపై చూపిన ప్రేమే ఆయనను ఒక లెజెండ్‌గా నిలిపాయి. తాజాగా ఆయన సహచర ఆటగాడు కర్సన్ ఘవ్రి ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు. అది గవాస్కర్ బ్యాటింగ్‌పై ఎంతగా దృష్టి పెట్టేవాడో, ఏ విషయాన్నీ దానికంటే ముఖ్యంగా పరిగణించేవాడో స్పష్టంగా చూపిస్తుంది.ఢిల్లీ వేదికగా జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గవాస్కర్ (Sunil Gavaskar) డ్రెస్సింగ్ రూమ్‌లో ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. ఆ సమయంలో అప్పటి ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ ఆటగాళ్లందరినీ కలవాలని టీమ్ మేనేజర్ రాజా సింగ్‌కి సూచించారు. దాంతో ఆటగాళ్లంతా ప్రధానిని కలవడానికి బయటకు వెళ్లమని మేనేజర్ కోరాడు. అయితే గవాస్కర్ మాత్రం తన బ్యాటింగ్ సిద్ధత నుంచి దృష్టి మళ్లించలేదు.

ఓపెనర్‌గా గవాస్కర్

మోరార్జీ దేశాయ్ 10 నిమిషాల ఆలస్యంగా రావడంతో అప్పటికే టాస్ పూర్తయ్యింది. మ్యాచ్ ప్రారంభం కాబోతుండటంతో గవాస్కర్ డ్రెస్సింగ్ రూమ్‌లోనే కూర్చొని తన మైండ్ సెట్‌ను ఆటపై కేంద్రీకరించాడు. ఈ సమయంలో ఆయన “నా బ్యాటింగ్ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ఒకసారి మైదానంలోకి దిగితే, దేశం కోసం ఆడితే, అది ఎవరికీ వదిలిపెట్టలేనిది” అని చెప్పాడని కర్సన్ ఘవ్రి గుర్తు చేసుకున్నారు.భారత్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. దాంతోనే ఓపెనర్‌గా గవాస్కర్ ప్యాడప్ అయి సిద్దంగా ఉన్నాడు. ప్రధానమంత్రిని కలవడానికి తనకు సమయం లేదని మేనేజర్‌తో చెప్పాడు. ఒంటరిగా వదిలేయాలని, తనకు, జట్టుకు బ్యాటింగ్ చేయడం చాలా కీలకమని చెప్పాడు. దాంతో గవాస్కర్ మినహా మిగతా ఆటగాళ్లమంతా మొరార్జీ దేశాయ్‌ (Morarji Desai) ను కలిసి ఆయన అభినందనలను అందుకున్నాం. కానీ గవాస్కర్ మాత్రం ప్రధానిని కలిసేందుకు రాలేదు.

Karsan Ghavri

డ్రెస్సింగ్ రూమ్‌

టీ సెషన్ వరకు సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ చేశాడు. మెరుగైన స్కోర్ సాధించాడు. గవాస్కర్‌ను కలవడానికే ప్రధాని టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చారని ఆ రోజు ఆట పూర్తయ్యేవరకు మాకు తెలియలేదు. ఇది గవాస్కర్. తన హయాంలో చాలా నిక్కచ్చిగా ఉండేవాడు.’ అని కర్సన్ ఘవ్రి చెప్పుకొచ్చారు. 1975 వన్డే ప్రపంచకప్‌ (One Day World Cup) లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గవాస్కర్ 174 బంతులాడి 36 పరుగులు చేసిన ఘటనను కూడా ఘవ్రి గుర్తు చేసుకున్నారు. ఆ మ్యాచ్‌లో వేగంగా ఆడాలని చెప్పినా గవాస్కర్ పట్టించుకోలేదని, తదుపరి టెస్ట్ సిరీస్ కోసం ప్రాక్టీస్ చేశానని బదులిచ్చాడని తెలిపారు.’భారత క్రికెటర్లుగా వన్డే క్రికెట్ ఎలా ఆడాలో మాకు తెలియదు. తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్ 334 పరుగుల భారీ స్కోర్ చేసింది.

నెమ్మదిగా ఆడటానికి

కానీ మా బ్యాటింగ్ సమయంలో సునీల్ గవాస్కర్ 60 ఓవర్ల పాటు ఆడాడు. చాలా సార్లు వేగంగా ఆడాలనే సందేశాన్ని డ్రెస్సింగ్ రూమ్స్ నుంచి పంపించాం. దూకుడుగా ఆడకుంటే ఔటవ్వాలని కూడా చెప్పాం. పేస్‌పై ఎదురుదాడికి దిగాలని తెలిపాం. కానీ సునీల్ గవాస్కర్ ఎవరి మాట వినలేదు.టోనీ గ్రైగ్, జియోఫ్ ఆర్నాల్డ్, క్రిస్ ఓల్డ్, బాబ్ విల్స్‌లను ఎదుర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం నెమ్మదిగా ఆడటానికి గల కారణాన్ని గవాస్కర్ చెప్పాడు. భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్‌లో వారిపై మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ మ్యాచ్‌ను ఉపయోగించుకున్నానని తెలిపాడు. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో గందరగోళం నెలకొంది. ఈ ఇన్నింగ్స్‌పై మేనేజర్ ప్రశ్నించగా.. ఒంటరిగా వదిలేయాలని గవాస్కర్ అరిచాడు.’అని ఘవ్రి గుర్తు చేసుకున్నారు.

భారత జట్టు తరఫున ఎప్పుడు అరంగేట్రం చేశారు?

1971లో వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసి తన మొదటి సిరీస్‌లోనే 774 పరుగులు సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.

సునీల్ గవాస్కర్ ప్రత్యేకత ఏమిటి?

ప్రపంచంలో మొట్టమొదటగా టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడు గవాస్కర్. అలాగే 34 టెస్ట్ సెంచరీలతో రికార్డు సృష్టించారు.

Read more: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/anaya-bangar-the-first-transgender-athlete-to-enter-the-bigg-boss-house-for-the-first-time/sports/531932/

Breaking News cricket controversy Indian Cricket Legend Indian Prime Minister Karson Ghavri latest news Morarji Desai Sunil Gavaskar Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.