📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Karnataka: చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Author Icon By Aanusha
Updated: January 17, 2026 • 11:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటక (Karnataka) లోని, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ సందడి మొదలుకానుంది. అంతర్జాతీయ మ్యాచ్‌లు, ఐపీఎల్ లు ఈ స్టేడియం లో నిర్వహించేందుకు,, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) శనివారం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మ్యాచ్‌లు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో నెలకొన్న అనిశ్చితికి ఈ అనుమతితో తెరపడింది.

Read Also: U19 World Cup controversy : అండర్-19 WCలో హ్యాండ్‌షేక్ వివాదం, బంగ్లా బోర్డు క్లారిటీ!

మైఖేల్ డి’కున్హా కమిటీ సిఫార్సులు

జూన్ 4న జరిగిన ఈ విషాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 56 మంది గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ… దులీప్ ట్రోఫీ, ఇండియా-సౌతాఫ్రికా ‘ఏ’ సిరీస్, విజయ్ హజారే ట్రోఫీతో పాటు 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సహా పలు కీలక టోర్నీలను చిన్నస్వామి నుంచి తరలించింది. ఈ విషాదంపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ మైఖేల్ డి’కున్హా కమిటీ సిఫార్సులను అమలు చేస్తేనే మ్యాచ్‌ల నిర్వహణకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Karnataka: The government has given the green light for matches at Chinnaswamy Stadium

ఈ నేపథ్యంలో, భద్రత, ప్రేక్షకుల నిర్వహణకు సంబంధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని కేఎస్‌సీఏ అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ హామీ ఇచ్చారు.ప్రభుత్వం నుంచి అనుమతి లభించినప్పటికీ, ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచ్‌లన్నీ చిన్నస్వామిలోనే ఆడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే, రెండు మ్యాచ్‌లను రాయ్‌పూర్‌లో నిర్వహించేందుకు ఆ జట్టు యాజమాన్యం ఇటీవలే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

chinnaswamy stadium Karnataka Government KSCA latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.