📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Kane Williamson: T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్

Author Icon By Aanusha
Updated: November 2, 2025 • 10:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూజిలాండ్‌ క్రికెట్‌ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయానికి తెరపడింది. ఆ జట్టు మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ (Kane Williamson) అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ కు వీడ్కోలు పలికాడు. వన్డే, టెస్టు కెరీర్‌పై మరింత దృష్టి సారించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించాడు.వచ్చే ఏడాది భారత్‌, శ్రీలంక వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కు కొన్ని నెలల ముందే ఈ ఫార్మాట్‌ నుండి తప్పుకోవడం కివీస్‌ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

Read Also: ODI Series: ENGపై న్యూజిలాండ్ గెలుపు

విలియమ్సన్ (Kane Williamson) తన 13 ఏళ్ల టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 93 మ్యాచ్‌లు ఆడి 33 సగటుతో 2,575 పరుగులు చేశాడు. ఇందులో 18 అర్ధశతకాలు ఉన్నాయి. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా ఆయన నిలిచాడు.

అంతేకాకుండా, 75 మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించి, రెండుసార్లు (2016, 2022) టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు, ఒకసారి (2021) ఫైనల్‌కు జట్టును చేర్చాడు.తన రిటైర్మెంట్‌పై విలియమ్సన్ మాట్లాడుతూ “చాలా కాలంగా నేను ఈ ఫార్మాట్‌లో భాగమవ్వడాన్ని ఆస్వాదించాను. ఈ ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.

ఇదే సరైన సమయం అని భావిస్తున్నా

అయితే, నాకూ, జట్టుకూ ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు జట్టుకు ఒక స్పష్టత ఇవ్వాలనుకున్నాను. జట్టులో ఎంతో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లు ఉన్నారు. వారికి మరిన్ని అవకాశాలు ఇచ్చి ప్రపంచకప్‌నకు సిద్ధం చేయాలి. మిచ్ (సాంట్నర్) అద్భుతమైన కెప్టెన్. ఇకపై జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత వారిదే. నేను బయట నుంచి మద్దతు ఇస్తాను” అని వివరించాడు.

Kane Williamson

మూడు టెస్టుల సిరీస్‌పై ప్రస్తుతం దృష్టి

డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్‌పై ప్రస్తుతం దృష్టి పెట్టినట్లు విలియమ్సన్ తెలిపాడు. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశాడు.విలియమ్సన్ నిర్ణయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ సీఈవో స్కాట్ వీనింక్ గౌరవించారు.

“టీ20 జట్టుకు ఆటగాడిగా, కెప్టెన్‌గా కేన్ అందించిన సేవలు అపారమైనవి. 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో అతను ఆడిన 85 పరుగుల ఇన్నింగ్స్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. అతని కెరీర్‌లోని మిగిలిన ప్రయాణానికి మా పూర్తి మద్దతు ఉంటుంది” అని వీనింక్ తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Breaking News Kane Williamson Kane Williamson T20 latest news New Zealand Cricket T20 retirement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.