📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: John Cena: WWE కి జాన్ సీనా గుడ్ బై

Author Icon By Anusha
Updated: December 14, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
John Cena says goodbye to WWE

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం జాన్ సెనా (John Cena) హార్ట్ బ్రేక్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. WWE కు గుడ్ బై చెప్పాడు. ఇందులో నుంచి అధికారికంగా తప్పుకొన్నాడు. ఓటమితో తన సుదీర్ఘ కేరీర్ ను ముగించాడు. తాను చిట్టచివరి గేమ్ లో గుంథేర్ చేతిలో ఓటమిపాలయ్యాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించాడు. డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి రిటైర్ అవుతున్నట్లు వెల్లడించాడు. తనను ఆదరించిన కోట్లాదిమంది అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.

Read Also: Kolkata: సెల్ఫీల కోసం ఎగబడటంతో.. మెస్సీ తీవ్ర అసహనం

మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది

దాదాపు 20 ఏళ్లలో తొలిసారి ‘టాప్ అవుట్’ (ప్రత్యర్థి పట్టుకు తట్టుకోలేక ఓటమిని అంగీకరించడం) కావడంతో స్టేడియంలోని అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ కార్యక్రమానికి కర్ట్ యాంగిల్, మార్క్ హెన్రీ, రాబ్ వాన్ డామ్, ట్రిష్ స్ట్రాటస్ వంటి ఎందరో డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ దిగ్గజాలు హాజరై జాన్ సీనాకు మద్దతుగా నిలిచారు. ది రాక్, కేన్ వంటి స్టార్లు వీడియో సందేశాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది.

గుంథర్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, సీనా తనదైన శైలిలో ఫైవ్-నకిల్ షఫుల్, ఏఏ (ఆటిట్యూడ్ అడ్జస్ట్‌మెంట్) వంటి మూవ్స్‌తో గట్టి పోటీ ఇచ్చాడు.అనౌన్సర్ టేబుల్‌పై గుంథర్‌కు ఏఏ ఇచ్చి మ్యాచ్‌పై పట్టు సాధించినట్లు కనిపించినా, గుంథర్ బలంగా పుంజుకున్నాడు. చివరికి తన సిగ్నేచర్ స్లీపర్ హోల్డ్‌తో జాన్‌ సీనా (John Cena)ను బంధించాడు. ఆ పట్టు నుంచి తప్పించుకోలేక సీనా టాప్ అవుట్ చేయాల్సి వచ్చింది. ఈ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ బుకింగ్‌పై తీవ్ర ఆగ్రహం, నిరాశ వ్యక్తం చేశారు.మ్యాచ్ అనంతరం ఇతర రెజ్లర్లు రింగ్‌లోకి వచ్చి జాన్‌ సీనాను అభినందించారు. భావోద్వేగానికి గురైన సీనా, రింగ్ మధ్యలో తన బూట్లను వదిలి రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. “ఇన్నేళ్లుగా మీకు సేవ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు” అని కెమెరా వైపు చూస్తూ చెప్పి, అభిమానుల చప్పట్ల మధ్య నిష్క్రమించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

John Cena latest news Telugu News wrestling news wwe WWE Retirement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.