📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Joe Root: సచిన్ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన జో రూట్

Author Icon By Aanusha
Updated: November 22, 2025 • 10:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

క్రికెట్ ప్రపంచంలో “క్లాసికల్ బ్యాటర్”గా పేరొందిన జో రూట్‌ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ కు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా గడ్డపై తన పేలవమైన రికార్డును కొనసాగిస్తూ, పెర్త్‌లో జరిగిన యాషెస్ తొలి టెస్టులో ఘోరంగా విఫలమయ్యాడు.

Read Also: T20 World Cup 2026: 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించిన ICC

మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన రూట్, రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండుసార్లూ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లోనే వికెట్ సమర్పించుకోవడం గమనార్హం. ఈ వైఫల్యంతో సచిన్ రికార్డును అధిగమించాలన్న రూట్ కల మరింత దూరమైంది.

పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, హ్యారీ బ్రూక్ (52) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 58 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.

Joe Root failed to break Sachin’s record

ఒక్క సెంచరీ కూడా చేయలేదు

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 132 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. దీంతో ఇంగ్లండ్‌కు 40 పరుగుల ఆధిక్యం లభించింది.అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా జో రూట్ (8) మరోసారి నిరాశపరిచాడు. దీంతో ఆస్ట్రేలియా ముందు 205 పరుగుల లక్ష్యం నిలిచింది.

ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ట్రావిస్ హెడ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. అతనికి మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ అండగా నిలవడంతో ఆస్ట్రేలియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా విజయాన్ని అందుకుంది.ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో సచిన్ (15,921) తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జో రూట్ (13,551) రెండో స్థానంలో ఉన్నాడు.

159 టెస్టుల్లో 50.94 సగటుతో 39 సెంచరీలు సాధించిన రూట్‌కు, ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం రికార్డు దారుణంగా ఉంది. ఆసీస్‌లో ఇప్పటివరకు 15 టెస్టులు ఆడినా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. కేవలం 33.33 సగటుతో 900 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు తొలి టెస్టులోనూ విఫలం కావడంతో, మిగిలిన 4 టెస్టుల్లోనైనా రాణించి సచిన్ రికార్డుకు చేరువవుతాడో లేదో చూడాలి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Ashes 2025 Joe Root failure latest news Root vs Starc sachin tendulkar record Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.