Latest News: Jemima Rodrigues: ఆ తిరస్కారమే.. విజయానికి చేరువ చేసింది

Read Time:  1 min
Jemima Rodrigues
Jemima Rodrigues
FONT SIZE
GET APP

మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (Women’s ODI World Cup 2025) లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చిన జెమీమా రోడ్రిగ్స్ (Jemima Rodrigues) ప్రదర్శన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ విజయానికి వెనుక ఉన్న ఆమె ప్రయాణం అంత సులభం కాదు. ఎన్నో ఎత్తుపల్లాలు, నిరాశలు, కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకోవడం ఆమె క్రీడా జీవితంలో గొప్ప మలుపుగా నిలిచింది.

Read Also: Women’s World Cup 2025: జీసస్ వల్లే ఈ విజయం: జెమీమా

జెమీమా రోడ్రిగ్స్ (Jemima Rodrigues) 2022 ప్రపంచకప్‌లో జట్టులో చోటు దక్కించుకోలేకపోయింది. అప్పుడు సెలెక్షన్ కమిటీ ఆమెను ఫామ్‌లో లేరన్న కారణంతో పక్కన పెట్టింది. ఆ నిర్ణయం ఆమెకు తీవ్ర దెబ్బ తగిలినట్లే అయ్యింది. “ఆ రోజున నేను చాలా ఏడ్చాను. కానీ అప్పుడు నేర్చుకున్నది ఒకటే — కష్టపడితేనే ఫలితం వస్తుంది,” అని జెమీమా తరువాత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ నిరాశను బలంగా తీసుకుని, ఆమె తిరిగి తన ఆటపై దృష్టి సారించింది.

Jemima Rodrigues
Jemima Rodrigues

ఈసారి ఫామ్‌లో ఉండటంతో తొలిసారి WC ఆడే ఛాన్స్ ఇచ్చారు. కానీ తొలి 4 మ్యాచుల్లో జెమీమా 2సార్లు డకౌట్ కాగా మరో 2సార్లు 30ల్లో ఔట్ అయ్యారు. దీంతో ENG మ్యాచులో తప్పించారు. అయినా కుంగిపోకుండా తర్వాత NZపై 76*, నిన్న సెమీస్‌లో 127* రన్స్ చేసి INDను ఫైనల్ చేర్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.