దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దాంతో 74 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.
Read Also: T20 Highlights: అర్ష్‌దీప్, హార్దిక్ దెబ్బ: 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా
బూమ్రా సంచలన రికార్డు
ఇప్పటికే టెస్ట్‌ల్లో 234 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. వన్డేల్లో 149 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా మూడు ఫార్మాట్లలో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా.. ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. లసిత్ మలింగ, షకిబ్ అల్ హసన్, టీమ్ సౌథీ, షాహిన్ అఫ్రిది మాత్రమే ఈ ఘనతను అందుకున్నారు. అంతేకాకుండా భారత్ తరఫున 100 వికెట్ల మైలురాయి అందుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు.
అర్ష్‌దీప్ సింగ్(105 వికెట్లు) బుమ్రా కంటే ముందున్నారు.ఈ మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఊచకోతతో పోరాడే లక్ష్యాన్ని అందుకున్న భారత్.. ఆ తర్వాత బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పూర్తిగా టీమిండియానే ఆధిపత్యం చెలాయించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: