టీమిండియా క్రికెటర్,యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) తన కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు.. దక్షిణాఫ్రికాతో విశాఖపట్నంలో జరిగిన మూడవ వన్డే మ్యాచ్‌లో ఆయన తన వన్డే కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో జైస్వాల్, భారత క్రికెట్ చరిత్రలో మూడు ఫార్మాట్లలో (టెస్టు, వన్డే, టీ20 అంతర్జాతీయ) సెంచరీలు సాధించిన ఆరో భారత క్రికెటర్‌గా ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాడు.
Read Also: Dale Steyn: కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్:మాజీ పేసర్
జైస్వాల్ హాఫ్ సెంచరీ
యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కి ఇది కేవలం నాలుగో వన్డే మ్యాచ్ మాత్రమే. అంతకుముందే టెస్టు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీలు సాధించిన జైస్వాల్ ఇప్పుడు వన్డే సెంచరీతో ఆ జాబితాలో చేరిపోయాడు. జైస్వాల్ కంటే ముందు ఐదుగురు భారత బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించారు.
ఆ ఐదుగురు దిగ్గజాలువిరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, శుభ్‌మన్ గిల్.ఇప్పుడు ఈ దిగ్గజాల సరసన యశస్వి జైస్వాల్ కూడా నిలిచి, భవిష్యత్తులో భారత క్రికెట్‌కు తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి రెండు వన్డేలలో (18, 22 పరుగులు) పెద్దగా రాణించలేకపోయిన జైస్వాల్, కీలకమైన మూడో మ్యాచ్‌లో మాత్రం బాగా ఆడాడు. తొలుత నెమ్మదిగా ఆడిన జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేయడానికి 75 బంతులు తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత వేగం పెంచాడు.
తదుపరి 50 పరుగులు సాధించడానికి కేవలం 35 బంతులు మాత్రమే తీసుకున్నాడు. జైస్వాల్ మొత్తం 111 బంతుల్లో ఈ సెంచరీ పూర్తి చేశాడు. చివరికి అతను 121 బంతుల్లో 116 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనింగ్‌లో రోహిత్ శర్మతో (75 పరుగులు) కలిసి, జైస్వాల్ తొలి వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, భారత్ విజయాన్ని సులభతరం చేశాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: