📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Jahanara Alam: సెలక్టర్‌పై బంగ్లా మహిళా క్రికెటర్ ఆరోపణలు

Author Icon By Anusha
Updated: November 7, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ మహిళా, జాతీయ జట్టు మాజీ సెలక్టర్ మంజూరుల్ ఇస్లాం తనను లైంగిక వేధింపులకి గురి చేశాడని ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జహనారా ఆలం (Jahanara Alam) చేసిన సంచలన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. మానసిక ఆరోగ్య కారణాలతో ప్రస్తుతం ఆటకు దూరంగా ఉంటున్న ఆమె, ఇన్నాళ్లుగా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి ఓ యూట్యూబ్ చానెల్‌ (YouTube channel) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

Read Also: BCCI: ఐసీసీకి చేరిన ఆసియా కప్ ట్రోఫీ వివాదం

అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదురయ్యాయని

మహిళల వన్డే ప్రపంచ కప్ 2022 (Women’s ODI World Cup 2022) సమయంలో జట్టు యాజమాన్యం నుంచి తనకు అసభ్యకరమైన ప్రతిపాదనలు ఎదురయ్యాయని జహనారా వివరించారు. మాజీ సెలక్టర్ మంజూరుల్ ఇస్లాం ప్రతిపాదనలను తాను తిరస్కరించినందుకే తన కెరీర్‌కు అడ్డుపడ్డాడని ఆమె ఆరోపించారు. “నేను ఒకసారి కాదు, చాలాసార్లు ఇలాంటి ప్రతిపాదనలను ఎదుర్కొన్నాను.

జట్టులో ఉన్నప్పుడు మా పొట్టకూటి కోసం ఎన్నో విషయాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు నిరసన తెలపాలని ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి” అని జహనారా (Jahanara Alam) ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)లోని పలువురు సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయిందని ఆమె తెలిపారు.

నా ఫిర్యాదులను పట్టించుకోలేదు

మహిళా కమిటీ హెడ్, బీసీబీ సీఈవో సైతం తన ఫిర్యాదులను పట్టించుకోలేదని ఆరోపించారు. జట్టులో మంజూరుల్ ప్రవర్తన గురించి జహనారా వివరిస్తూ “అమ్మాయిల దగ్గరికి వచ్చి భుజంపై చేయి వేయడం, చాతీకి అదుముకుని, చెవి దగ్గర మాట్లాడటం ఆయనకు అలవాటు. అందుకే మేమంతా అతడిని దూరం పెట్టేవాళ్లం.

Jahanara Alam

మ్యాచ్‌ల తర్వాత షేక్‌హ్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా దూరం నుంచే చేతులు చాచేవాళ్లం. ‘ఆయన వస్తున్నాడు, మళ్లీ హగ్ చేసుకుంటాడు’ అని మేం భయంతో జోకులు వేసుకునేవాళ్లం” అని తెలిపారు.ఒకానొక సందర్భంలో మంజూరుల్ తన దగ్గరకు వచ్చి చేతిని పట్టుకుని “నీ పీరియడ్ వచ్చి ఎన్ని రోజులయింది?” అని అసభ్యంగా అడిగాడని జహనారా గుర్తు చేసుకున్నారు.

ఆటగాళ్ల ఆరోగ్యం కోసం ఈ వివరాలు తీసుకుంటారు

“ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం ఫిజియోలు ఆటగాళ్ల ఆరోగ్యం కోసం ఈ వివరాలు తీసుకుంటారు. కానీ సెలక్టర్‌కు ఆ సమాచారం ఎందుకో నాకు అర్థం కాలేదు. నేను ‘క్షమించండి భయ్యా, నాకు అర్థం కాలేదు’ అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను” అని ఆమె వివరించారు.

జహనారా చేసిన ఆరోపణలపై మంజూరుల్ ఇస్లాం స్పందించారు. అవన్నీ నిరాధారమైనవని కొట్టిపారేశాడు. తన గురించి ఇతర క్రికెటర్లను అడిగితే తెలుస్తుందని అన్నాడు. మరోవైపు, ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పందించింది.

జహనారా చేసిన ఆరోపణలపై స్పందించిన మంజూరుల్

జహనారా ఆరోపణలు చాలా తీవ్రమైనవని, దీనిపై త్వరలోనే సమావేశమై తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని బోర్డు ఉపాధ్యక్షుడు షఖావత్ హొస్సేన్ (Shakhawat Hossain) తెలిపారు. అవసరమైతే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Bangladesh Cricket Board Bangladesh women cricket Jahanara Alam allegations latest news Manjurul Islam harassment Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.