📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Jagan Mohan Rao: హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుకు రిమాండ్

Author Icon By Sharanya
Updated: July 11, 2025 • 10:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్: గత ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA), సన్రైజర్స్ హైదరాబాద్ నడుమ టికెట్ల వివాదంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుకు (Jagan Mohan Rao) 22వరకు మేడ్చల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. నకిలీ పత్రాలతో క్లబ్ల ఏర్పాటు, నిధుల దారి మళ్లింపు, సంతకం ఫోర్జరీ కేసుల్లో గురువారం సీఐడీ లోతుగా విచారణ చేపట్టింది. ఈ మేరకు కోర్టులో హజరుపరచడంతో వాదనలు విని జైలుకు తరలించారు.

జగన్మోహన్రావుకు రిమాండ్

ఈ కేసులో సీఐడీ (CID) ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసింది తెలిసిందే. కొంతకాలంగా వివాదం నెలకొనడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారుల దర్యాప్తు నివేదికతో సీఐడీ కేసు నమోదు చేసింది. దీంతో విచారణలో మరెన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. గౌలిపుర క్రికెట్ క్లబ్ బీఎన్ అధ్యక్షుడు సి. కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేయడమే కాకుండా నకిలీపత్రాలతో క్లబ్లు ఏర్పాటు చేసింది. అదేవిధంగా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ను నిర్వహించినట్లు గుర్తించింది. దీంతో హెచ్సీఏ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీచేసి అక్రమంగా గెలిచారు. ఆయనతో పాటు హెచ్సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్, హెచ్సీఏ సీఈవో సునీల్ కాంటే, చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు జి. కవితలు కుట్రపూరితంగానే ఎన్నికైనట్లు విచారణలో వెలుగుచూసింది.

అదేవిధంగా నిధుల దుర్వినియోగానికి సైతం వారి హస్తం ఉందని సీఐడీ వెల్లడించింది. కాంప్లిమెంటరీ టికెట్లపై జగన్ మోహన్ రావు (Jagan Mohan Rao) బ్లాక్మెయిల్కు పాల్పడ్డారని, కార్పొరేట్ బాక్సులకు ఉద్దేశపూర్వకంగా తాళాలు వేసి వేధించడం.. తాము చెప్పినట్లు వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు పలు కీలక అంశాలను సీఐడీ వెలుగులోకి తీసుకవచ్చింది .

ప్రస్తుతం హెచ్సీఏ అధ్యక్షుడు ఎవరు?

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.

హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్‌మోహన్‌రావు ఎన్నికైన సంవత్సరం ఏది?

ఏ. జగన్మోహన్‌రావు 2023 అక్టోబర్ 20న (అధికారం ప్రారంభమైనది 2023) హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Nitish Kumar Reddy : ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి

Breaking News CorruptionCharges HCA HyderabadCricket JaganMohanRao JudicialRemand latest news SportsControversy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.