📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Ravindra Jadeja: ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌..తనను ఎంపిక చేయకపోవడంపై స్పందించిన జడేజా

Author Icon By Aanusha
Updated: October 11, 2025 • 9:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) మరోసారి తన ప్రశాంత స్వభావాన్ని చాటుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే వన్డే జట్టులో తనకు చోటు దక్కకపోవడంపై ఆయన స్పందించాడు. సాధారణంగా ప్లేయర్లు జట్టులో లేకపోతే నిరాశ వ్యక్తం చేస్తారు. కానీ జడేజా మాత్రం విభిన్నంగా స్పందించాడు.

Ravindra Jadeja:విండీస్‌ను దెబ్బతీసిన రవీంద్ర జడేజా

తనను వన్డే జట్టులో ఎంపిక చేయకపోవడం గురించి కెప్టెన్, సెలక్టర్లు, కోచ్ ముందుగానే మాట్లాడి వివరించారని తెలిపాడు. “ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. నేను కూడా జట్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను” అని స్పష్టంచేశాడు.

జడేజా (Ravindra Jadeja) ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. అక్కడ జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు. “క్రికెట్ అనేది జట్టు ఆట. ప్రతిసారి మనం జట్టులో ఉండలేము. ఒక సీజన్‌లో ఎవరో ఒక్కరు విశ్రాంతి తీసుకుంటారు, మరొకరికి అవకాశం దొరుకుతుంది. ఇది సహజమే.

నేను ఇప్పుడు టెస్టులపై దృష్టి

నేను ఇప్పుడు టెస్టులపై దృష్టి పెట్టాను. వన్డేలు, టీ20ల గురించి తర్వాత ఆలోచిస్తాను” అని అన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం గురించి జడేజా వివరిస్తూ, “జట్టు ఎంపిక నా చేతుల్లో లేదు. ఆడాలని నాకు ఉంటుంది, కానీ అంతిమంగా టీమ్ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు, కోచ్, కెప్టెన్‌లకు వారి సొంత ఆలోచనలు ఉంటాయి.

Ravindra Jadeja

ప్రతిసారీ జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన

ఈ సిరీస్‌కు నన్ను ఎందుకు ఎంపిక చేయలేదు? అనే దాని వెనుక కచ్చితంగా ఓ కారణం ఉంటుంది. ఆ విషయాన్ని వాళ్లు నాతో చర్చించారు. జట్టును ప్రకటించాక నేను ఆశ్చర్యపోలేదు. కెప్టెన్, సెలక్టర్, కోచ్ నాతో మాట్లాడి కారణాలు చెప్పడం మంచి విషయం” అని తెలిపాడు.

అవకాశం వచ్చిన ప్రతిసారీ జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని జడేజా చెప్పాడు. “ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్‌లో ఆడే అవకాశం వస్తే అది భారత క్రికెట్‌కు మంచిది. గతసారి తృటిలో కప్ చేజార్చుకున్నాం.

టెస్ట్ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా

ఈసారి ఎలాగైనా గెలిచి కలను నెరవేర్చుకుంటాం” అని ఆశాభావం వ్యక్తం చేశాడు.వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రయోజనాలకే తాను అధిక ప్రాధాన్యం ఇస్తానని జడేజా (Ravindra Jadeja) స్పష్టం చేశాడు. “నేను పరుగులు చేసినా, వికెట్లు తీసినా అది జట్టు గెలుపునకు ఉపయోగపడిందా లేదా అన్నదే నాకు ముఖ్యం.

జట్టు ఓడిపోయినప్పుడు వ్యక్తిగత ప్రదర్శనలకు విలువ ఉండదు. జట్టు గెలిచినప్పుడు నా ప్రదర్శన ప్రభావవంతంగా ఉంటేనే నాకు సంతృప్తి” అని వివరించాడు.ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జడేజా, జట్టు అవసరాలకు తగ్గట్లు తనను తాను మార్చుకుంటానని అన్నాడు. జైస్వాల్, కుల్దీప్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లు సలహాల కోసం తన వద్దకు వస్తారని, వారికి తన అభిప్రాయాలు చెబుతానని పేర్కొన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Ravindra Jadeja Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.