భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) కుమార్తె సారా టెండూల్కర్ (Sara Tendulkar) తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవా ట్రిప్ కు వెళ్లిన సారా.. హాలిడేను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సారా టెండూల్కర్‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో ఎప్పటితో అధికారికంగా నిర్ధారణ కాలేదుగానీ, నూతన సంవత్సర వేడుకల సమయానికి సంబంధించినదని కొందరు సోషల్ మీడియా యూజర్లు చెబుతున్నారు. వీడియోలో సారా తన స్నేహితులతో సరదాగా నడుస్తూ కనిపించగా, ఆమె చేతిలో బీర్ బాటిల్ ఉండటం గమనార్హం.
Read Also: T20 World Cup 2026: ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే
సారాకు పెద్ద ఎత్తున మద్దతు
కొందరు నెటిజన్లు సచిన్ టెండూల్కర్ పేరును కూడా లాగుతూ విమర్శలు గుప్పించారు. అయితే, ఈ ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా సారాకు పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించింది. “ఇది ఎంత వెనుకబడిన ఆలోచనా విధానం? సారా బీర్ తాగితే అది సచిన్ మద్యం ప్రచారం చేసినట్టా? ఒక కుమార్తెకి తన జీవితాన్ని ఆస్వాదించే హక్కు లేదా?” అంటూ ఒక యూజర్ ప్రశ్నించాడు. “ఇక్కడ ట్రోల్ చేయాల్సిన విషయం ఏముంది?” అంటూ మరో యూజర్ స్పందించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
ప్రొఫెషనల్‌గా చూస్తే సారా టెండూల్కర్ ఇటీవలే భారతీయ వెల్‌నెస్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టారు. ముంబై అంధేరిలో ఓ పిలాటిస్ స్టూడియోను ప్రారంభించారు. ఇది దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ పిలాటిస్ అకాడమీ ఫ్రాంచైజీకి చెందిన నాలుగో బ్రాంచ్. “నా ఫిట్‌నెస్ ప్రయాణంలో పిలాటిస్ కీలక పాత్ర పోషించింది. క్లినికల్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో వెల్‌నెస్‌ను కేవలం వ్యాయామం లేదా డైట్‌గా చూడను. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే జీవితంలోని చిన్న ఆనందాలను ఆస్వాదించడమే అసలైన బ్యాలెన్స్” అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: