న్యూజిలాండ్‌తో జరుగుతున్న T20 సిరీస్‌లో భారత జట్టు ప్రదర్శనతో పాటు వ్యక్తిగత ఆటగాళ్ల ఆటతీరుపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ వరుసగా విఫలమవుతుండటంతో విమర్శలు పెరిగాయి. అభిమానుల నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం, కొందరు అతడిని జట్టులోంచి తప్పించాలన్న డిమాండ్ చేయడం కూడా కనిపిస్తోంది. అయితే ఈ సమయంలో మాజీ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సంజూ శాంసన్‌కు మద్దతుగా నిలిచారు.
Read Also: sanju samson : సొంతగడ్డపై సంజూ శాంసన్ ప్రదర్శనపై భారీ అంచనాలు
సంజూ ఫామ్‌పై మరింత చర్చ
బాగా ఆడుతున్న టైమ్‌లో సంజూను సడన్‌గా మిడిల్ ఆర్డర్‌కు పంపడం అన్యాయమని, అతనికి స్థిరమైన పొజిషన్ ఇవ్వాలని పఠాన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ సంజూ ఫామ్ అందుకోలేకపోతే అతని స్థానంలో ఇషాన్‌ను తీసుకోవడం సరైన నిర్ణయమన్నారు. సంజూకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలన్నారు. ఇటీవలి మ్యాచ్‌లలో సంజూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. విశాఖపట్నంలో జరిగిన నాలుగో టీ20లో అతను 24 పరుగులకే మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో ఓడిపోవడంతో, సంజూ ఫామ్‌పై మరింత చర్చ మొదలైంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: