బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను IPLలో ఆడించొద్దన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. విమర్శలు వస్తుండడం పట్ల బీసీసీఐ (BCCI) స్పందించింది. బంగ్లా ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడకుండా బ్యాన్ చేయాలంటూ, ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని, బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
Read also: RO-KO: బీసీసీఐ తీరుపై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ అసంతృప్తి
ఖరీదైన బంగ్లా ఆటగాడిగా ముస్తాఫిజుర్
గత నెలలో జరిగిన ఐపీఎల్ IPL మినీ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ.9.20 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో అతను ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బంగ్లా ఆటగాడిగా నిలిచాడు. అయితే, క్రీడలను రాజకీయ, దౌత్యపరమైన అంశాలకు దూరంగా ఉంచాలని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ముస్తాఫిజుర్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.మరోవైపు ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి తొలగించాలని కోల్‌కతా నైట్ రైడర్స్, ఆ టీమ్ ఓనర్ షారుఖ్ ఖాన్‌ను పలువురు హిందూ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: