ఐపీఎల్ (IPL) లో, ముఖ్యంగా ఆటగాళ్ల బదిలీలు, కెప్టెన్ల మార్పులు నెటిజన్లలో ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఫ్రాంచైజీ కూడా రాబోయే 2026 సీజన్ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతేడాది కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర్ పటేల్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను కొత్త సారథిగా నియమించేందుకు యాజమాన్యం మొగ్గు చూపుతోంది.
Read Also: T20 World Cup 2026: వన్డే సిరీస్‌కు దూరంగా కేన్ విలియమ్సన్
వ్యక్తిగత కారణాల వల్ల
కేఎల్ రాహుల్‌ను మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. వాస్తవానికి 2025 సీజన్ లోనే అతనికి కెప్టెన్సీ దక్కుతుందని భావించినప్పటికీ, అప్పట్లో వ్యక్తిగత కారణాల వల్ల లేదా యాజమాన్యం వ్యూహం వల్ల అక్షర్‌ను ఎంపిక చేశారు. అయితే, తాజా రిపోర్ట్స్ ప్రకారం, రాహుల్ కూడా కెప్టెన్సీ చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ (IPL) లో గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కి అక్షర్ సారథ్యం వహించగా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేదు.దీంతో కెప్టెన్సీ తీసుకోవాలని రాహుల్‌ను ఫ్రాంచైజీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్‌లోనే సారథిగా చేయాలని భావించినా ఆయన ఆసక్తి చూపలేదు. అటు WPLలో మెగ్ లానింగ్‌ను కెప్టెన్‌గా తప్పించి జెమీమాకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: