Latest News: DK Shivakumar: బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే శివకుమార్

Read Time:  1 min
Latest News: DK Shivakumar: బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే శివకుమార్
FONT SIZE
GET APP

ఇటీవల బెంగళూరులో జరిగిన ఆర్సీబీ (RCB) విజయ ఉత్సవాల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో స్టేడియం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. దీని ఫలితంగా బెంగళూరులో జరగాల్సిన 2025 మహిళల ప్రపంచ కప్ మ్యాచ్‌లను కూడా ఇతర వేదికలకు మార్చారు.

Read Also: Team India: టీమిండియాకు భారీ జరిమానా!

IPL matches to be held in Bengaluru: DK Shivakumar

కొత్త క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తాం

ఐపీఎల్ 2026కు ముందు ఆర్సీబీ మ్యాచ్‌లను కూడా తరలించవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో, చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) నుంచి IPL మ్యాచ్‌లను తరలించడానికి అనుమతించేది లేదని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ (DK Shivakumar) స్పష్టం చేశారు. “నేను ఒక క్రికెట్ ప్రేమికుడిని. ఆర్సీబీ మన గర్వకారణం.

అన్ని సమస్యలను సరిచేసి 2026 ఐపీఎల్ మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలోనే జరిగేలా చూస్తాను” అని ఆయన భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో తొక్కిసలాటలు జరగకుండా చూస్తాం. కొత్త క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తాం’ అని డీకే శివకుమార్ (DK Shivakumar) పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.