Kaviya maran news : క్రికెట్ ప్రపంచంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఒక అలిఖిత నియమాన్ని బ్రేక్ చేస్తూ పాకిస్థాన్ ఆటగాడిని తమ జట్టులోకి తీసుకున్నారు.
‘ది హండ్రెడ్’ లీగ్‌లో భాగంగా తమకు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కోసం పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారీ ధరకు కొనుగోలు చేశారు. లండన్‌లో జరిగిన వేలంలో ట్రెంట్ రాకెట్స్ జట్టుతో పోటీ పడుతూ సుమారు ₹2.34 కోట్లు వెచ్చించి అబ్రార్‌ను దక్కించుకున్నారు.
27 ఏళ్ల అబ్రార్ అహ్మద్ ఇటీవల జరిగిన 2026 టీ20 వరల్డ్ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా శ్రీలంకపై 3/23 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. యూరప్‌లో జరుగుతున్న లీగ్‌లో అబ్రార్ ఆడటం ఇదే మొదటిసారి.
Read Also: Gas Cylinder Shortage: గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ
సాధారణంగా ఐపీఎల్ జట్ల యజమానులు ఇతర గ్లోబల్ లీగ్‌లలో పాకిస్థాన్ ఆటగాళ్లను తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే కావ్య మారన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు కూడా ఈ పరిణామంపై స్పందించింది. ‘ది హండ్రెడ్’ లీగ్ ప్రతి దేశ ఆటగాళ్లకు సమాన అవకాశాలు కల్పించే వేదిక అని పేర్కొంది.
అబ్రార్ అహ్మద్‌తో పాటు ఉస్మాన్ తారిక్ అనే మరో పాకిస్థాన్ స్పిన్నర్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టు కొనుగోలు చేసింది. అయితే హరీస్ రవూఫ్, షాదాబ్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఈ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయారు.
కావ్య మారన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్ద చర్చగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: