📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2026: రాజస్థాన్ రాయల్స్ నాయకత్వ బాధ్యతలు ధ్రువ్ జురెల్‌కు అప్పగిస్తారా?

Author Icon By Anusha
Updated: August 8, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ జట్టుకు నాయకత్వం వహిస్తున్న సంజూ శాంసన్ (Sanju Samson) జట్టును వీడేందుకు సిద్ధమయ్యాడన్న వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఇదే సమయంలో యువ ప్లేయర్ ధ్రువ్ జురెల్‌ను రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా నియమించబోతున్నారన్న ఊహాగానాలు సైతం వెలువడుతున్నాయి.తాజాగా రాజస్థాన్ రాయల్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టిన ఓ ఫోటో ఈ ప్రచారాలకు మరింత బలాన్నిచ్చింది. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో విభేదాలు తలెత్తడంతోనే సంజూ శాంసన్ జట్టును వీడేందుకు సిద్దమయ్యాడని, చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కూడా సంజూకు మంచి ఆఫర్ వచ్చిందని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. దులీప్ ట్రోఫీలో ధ్రువ్ జురెల్ సెంట్రల్ జోన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాజస్థాన్ రాయల్స్ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది.

‘స్టంప్స్ వెనుక ఉండి మ్యాచ్‌ను మార్చేసే ప్లేయర్ అతడు’అని క్యాప్షన్ ఇచ్చింది. దాంతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ బాధ్యతలు ధ్రువ్ జురెల్‌ (Dhruv Jurel) కు దక్కుతాయా? అనే చర్చ మొదలైంది. అయితే సంజూ శాంసన్ గైర్హాజరీలో రియాన్ పరాగ్ జట్టును నడిపించాడు. అంతేకాకుండా యశస్వి జైస్వాల్ రూపంలో జట్టులో మరో సీనియర్ ఆటగాడు ఉన్నాడు. ఈ ఇద్దర్నీ కాదని ధ్రువ్ జురెల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశం లేదని కొందరు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.ఆగస్ట్ 28 నుంచి దులీప్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ పర్యటనలో ఆఖరి టెస్ట్‌కు రిషభ్ పంత్ దూరమవ్వడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న ధ్రువ్ జురెల్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ స్కోర్లకే వెనుదిరిగాడు. వికెట్ కీపర్‌గా కూడా ధ్రువ్ జురెల్ తడబడ్డాడు.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎక్కడికి చెందినది?

ఈ జట్టు రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు చెందినది. జట్టు హోమ్ గ్రౌండ్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియం, జైపూర్‌లో ఉంది.

రాజస్థాన్ రాయల్స్ తాజా కెప్టెన్ ఎవరు?

2025లో కెప్టెన్ సంజూ శాంసన్ ఉన్నాడు. కానీ IPL 2026లో ధ్రువ్ జురెల్ కెప్టెన్ అయ్యే అవకాశాలపై వార్తలు వస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/haider-ali-arrested/sports/527664/

Breaking News Dhruv Jurel Dhruv Jurel Captain IPL 2026 IPL latest updates latest news Rajasthan Royals RR Captaincy RR team news Sanju Samson Sanju Samson release news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.