IPL 2026: క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన వైభవ్

Read Time:  1 min
IPL 2026: క్రిస్ గేల్ రికార్డుపై కన్నేసిన వైభవ్
FONT SIZE
GET APP
IPL 2026: Vaibhav sets his sights on Chris Gayle's record
IPL 2026: Vaibhav sets his sights on Chris Gayle’s record

IPL 2026: క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా 14 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరే మారుమోగిపోతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో అత్యంత పిన్న వయస్కుడిగా ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు, తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇప్పటికే దిగ్గజాల దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బీసీసీఐ నిర్వహించిన ‘నమన్ అవార్డ్స్’ వేడుకలో వైభవ్ చేసిన ఒక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: IPL Matches: చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్!

13 ఏళ్ల రికార్డుపై 14 ఏళ్ల కుర్రాడి కన్ను

ఐపీఎల్ చరిత్రలో 13 ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాని క్రిస్ గేల్ (175)* రికార్డును తాను ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో బద్ధలు కొడతానని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు. “ఆరు సిక్సర్లు కొట్టడం లేదా ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం కంటే, గేల్ నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించడమే నా ప్రధాన లక్ష్యం” అని ఈ యువ సెన్సేషన్ స్పష్టం చేశాడు.

వైభవ్ సూర్యవంశీ తన ఖాతాలో ఇప్పటికే అనేక అరుదైన రికార్డులను వేసుకున్నాడు. ఐపీఎల్ లో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ చేసిన యువకుడిగా అతను చరిత్ర సృష్టించాడు. 2013లో పూణే వారియర్స్ పై క్రిస్ గేల్ చిన్నస్వామి స్టేడియంలో చేసిన 175 పరుగుల రికార్డు ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయలేకపోయారు.

కానీ, వైభవ్ క్రీజులో ఉంటే ఆ రికార్డు ప్రమాదంలో ఉన్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో వైభవ్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.