IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!

Read Time:  1 min
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
FONT SIZE
GET APP

IPL 2026 Schedule: క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 (IPL 19వ సీజన్) ప్రారంభ తేదీలో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ మెగా టోర్నీని మార్చి 26 నుంచి ప్రారంభించాలని భావించినప్పటికీ, వివిధ కారణాల వల్ల దీనిని రెండు రోజులు వెనక్కి జరిపినట్లు సమాచారం. తాజా అప్‌డేట్ ప్రకారం, ఐపీఎల్ 2026 మార్చి 28న ఘనంగా ప్రారంభం కానుంది. మే 31న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ఈ సీజన్ ముగియనుంది.

Read Also: INDW vs AUSW 2nd ODI: ఆస్ట్రేలియా ముందు 252 పరుగుల లక్ష్యం

ఆటగాళ్ల కోసమే ఈ నిర్ణయం?

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ మార్పు చేయడానికి ప్రధాన కారణం ఫ్రాంచైజీలకు,ఆటగాళ్లకు తగినంత సమయం ఇవ్వడమేనని తెలుస్తోంది. వరుస సిరీస్‌ల వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా, టోర్నీ ప్రారంభానికి ముందు తగినంత విశ్రాంతి, సన్నాహక సమయం కల్పించాలని కౌన్సిల్ నిర్ణయించింది. ఈ రెండు రోజుల గడువు వల్ల జట్లు తమ వ్యూహాలను సిద్ధం చేసుకోవడానికి మరింత సమయం దొరకనుంది.

IPL 2026 Auction Date Revealed! Overseas Venue Finalised- Check Deets -  myKhel
IPL 2026 start postponed? These are the new dates!

ఆలస్యం ఎందుకంటే..?

అయితే ఈ నిర్ణయంపై ఐపీఎల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే వారంలో బీసీసీఐ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రముఖ వెబ్‌సైట్ క్రిక్‌ఇన్‌ ఫో పేర్కొంది. పూర్తి స్థాయి షెడ్యూల్‌తో పాటు వేదికలను కూడా ఆ రోజే వెల్లడించే అవకాశం ఉంది.అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికలకు సంబంధించి తేదీలపై స్పష్టత రానందున బీసీసీఐ వేచి చూస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పశ్చిమ బెంగాల్, తమిళనాడు నుంచి ఉన్నాయి. అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు గౌహతి రెండో హోంగ్రౌండ్. ఈ నేపథ్యంలో ఎన్నికల తేదీలకు అనుగుణంగా మ్యాచ్ తేదీలను ఖరారు చేయడానికి వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే షెడ్యూల్ రెండు దశల్లో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.